Hyderabad: మత్తులో యువత.. నగరానికి పెరుగుతున్న మాదకద్రవ్యాల రవాణా
నగరంలో గంజాయి, డ్రగ్స్ రవాణా వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. యువతే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది విక్రయదారులు యదేచ్ఛగా డ్రగ్స్, గంజాయిని అమ్ముతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై,గోవా లాంటి మహా నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ కి విపరీతంగా విస్తరించింది.

నగరంలో గంజాయి, డ్రగ్స్ రవాణా వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. యువతే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది విక్రయదారులు యదేచ్ఛగా డ్రగ్స్, గంజాయిని అమ్ముతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై,గోవా లాంటి మహా నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ కి విపరీతంగా విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు అనే మాట వినిపించకుండా కట్టడి చేయాలని ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్న ఏదో ఒక మూల నుంచి మాదకద్రవ్యాలు నగరానికి చేరుకుంటునే ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న గాంజాయి, డ్రగ్స్ రవాణాలు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించినటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు ఇటీవల కాలంలో సంచలనానికి తెర లేపిన్నటువంటి కబాలి నిర్మాత కేపీ చౌదరి కేసులోనూ విపరీతంగా డ్రగ్స్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా గోవా నుండి అధికారుల కళ్ళు కప్పి సిటీలోకి ఎంటర్ ఇస్తున్నారు కొంతమంది డ్రగ్ పెడ్లర్లు. అనంతరం పబ్బుల్లోకి, పార్టీలలోకి చెర వేస్తున్నారు. ఇక కాలేజికి వెళ్లే యువతకి డబ్బు ఆశ చూపి మాదకద్రవ్యాల మత్తులో మునిగిపోయేలా చేస్తున్నారు.
పెరుగుతున్న గంజాయి రవాణా రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో గంజాయి అమ్మకాలకు తెర లేపుతున్నారు వ్యాపారులు. వైజాగ్, ఒడిస్సా ప్రాంతాల నుంచి తరలిస్తున్న దళారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని దూల్‌పేట్, మంగల్ హాట్, ఫలక్‌నూమా, పురాణ పూల్ తో పాటు మరికొన్ని స్లం ఏరియాలలో చిన్న చిన్న ప్యాకెట్లలలో తయారు చేసిన గంజాయిని అమ్ముతున్నారు. 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ ఏకంగా వంద రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. డబ్బులు సులభంగా సంపాదించడం కోసం యువత క్యారియర్లుగా పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నగర శివారులో కొన్ని వందల కేజీల మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. కాపు కాసి మరి వాహనాలను పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.




ఔటర్ మీదుగానే రవాణా గంజాయి సాగు ఎక్కువగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలోనే సాగుతోంది. హైదరాబాద్ మీదుగా ముంబై తో పాటు మహారాష్ట్రలో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్న ఇతర ప్రాంతాలకు ఔటర్ మీదుగా గంజాయి రవాణా జరుగుతుంది..
మత్తులో హత్యలు మరోవైపు గంజాయికి బానిసలుగా మారినటువంటి కొంతమంది యువకులు హత్యలకు పాల్పడుతున్నారు. నగరంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యువకుల దాడిలో ఎక్కువ శాతం యువత గంజా మత్తులో దాడులు చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. దారి వెంట వెళ్తున్నటువంటి వారి మీద సైతం మాదగ ద్రవ్యాల మత్తులో మునిగి దాడికి తెగబడుతున్నారు కొంతమంది యువకులు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాదర ద్రవ్యాలను రూపుమాపేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.