Doctor Prabhu Kumar: నేషనల్ యంగ్ లీడర్ అవార్డును అందుకున్న తెలంగాణ డాక్టర్ ప్రభు కుమార్.. పలువురు ప్రముఖులు అభినందనలు
Doctor Prabhu Kumar: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా. ప్రభు కుమార్ చల్లగాలికి డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు..
Doctor Prabhu Kumar: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా. ప్రభు కుమార్ చల్లగాలికి డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు ప్రదానం చేశారు. యంగ్ లీడర్ గా డాక్టర్ ప్రభు కుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చింది ఐఎంఏ. ఆదివారం న్యూ ఢిల్లీలోని IMA హౌస్‌లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, జాతీయ నేతలు, వైద్య రంగ ప్రముఖులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ మెడికల్ డిపార్ట్ మెంట్ విభాగాధిపతి వికే పాల్, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ J.A. జయలాల్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేష్ లేలే లు ప్రభుకుమార్‌కు అవార్డు బహుకరించారు.
హైదరాబాద్‌లో నివాసముంటున్న డాక్టర్ ప్రభు కుమార్ కరోనా పాండమిక్‌లో అత్యధిక మంది పేషెంట్లకు వైద్యసేవలందించిన విషయం విదితమే. అంతే కాదు ప్రజల్లో కరోనా పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారిని చైతన్యం చేసేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక మంది మన్ననలు, విమర్శకుల ప్రశంసలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ప్రభుకుమార్ ఇప్పటికే వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డులు పొంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు తీసుకోవడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుకుమార్ కు అభినందనలు తెలిపారు.
Also Read: రియల్ సినతల్లి పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన హీరో సూర్య.. ఇల్లు కట్టిస్తానన్న లారెన్స్..
అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..
ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉండి ఆకస్మిక ధనలాభం పొందుతారంటే.. నేటి రాశిఫలాలు