Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉండి ఆకస్మిక ధనలాభం పొందుతారంటే.. నేటి రాశిఫలాలు

Horoscope Today (November 15th 2021): నేటికీ తాము ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా తమ దినఫలాలను నమ్మి మొదలు పెట్టేవారు .. తమ జాతకం, రాశిఫలాలపై దృష్టి

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉండి ఆకస్మిక ధనలాభం పొందుతారంటే.. నేటి రాశిఫలాలు
Follow us
Surya Kala

|

Updated on: Nov 15, 2021 | 7:01 AM

Horoscope Today (November 15th 2021): నేటికీ తాము ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా తమ దినఫలాలను నమ్మి మొదలు పెట్టేవారు .. తమ జాతకం, రాశిఫలాలపై దృష్టి సారిస్తారు. ఈరోజు తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని భావిస్తారు.  ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 15 వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త వస్తు, నగలు కొనుగోలు చేస్తారు. చేసిన అప్పులు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంది. ధన నష్టం ఏర్పడుతుంది. కలహాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకోని సంఘటనలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగరంగంలోని వారికీ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.  స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.  మంచి అవకాశాలు జారిపోయి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తులా రాశి: ఈ రోజు ఈ రాశివారు ధన వ్యయం చేస్తారు. బంధు మిత్రుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు సహనంగా ఉండడం మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు వినియోగ విషయంలో పొడుపుని పాటిస్తారు.  కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశికి ఆకస్మిక ధన లాభం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు స్థిరాస్తి విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలవలన ఇబ్బంది ఏర్పడుతుంది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

Also Read:

ఈ 3 రాశులవారు ఏ కష్టమొచ్చినా అబద్దం చెప్పరట.. అందులో మీరున్నారా.!

 అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..