Zodiac Signs: ఈ 3 రాశులవారు ఏ కష్టమొచ్చినా అబద్దం చెప్పరట.. అందులో మీరున్నారా.!

"నేను అబద్దం చెప్పనని మీకు తెలుసుగా'' ఈ పదాన్ని మనం తరచూ ఉపయోగిస్తాం. అయితే ఈ విషయాన్ని మనలో మనం ఎన్నిసార్లు...

Zodiac Signs: ఈ 3 రాశులవారు ఏ కష్టమొచ్చినా అబద్దం చెప్పరట.. అందులో మీరున్నారా.!
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 14, 2021 | 9:10 PM

“నేను అబద్దం చెప్పనని మీకు తెలుసుగా” ఈ పదాన్ని మనం తరచూ ఉపయోగిస్తాం. అయితే ఈ విషయాన్ని మనలో మనం ఎన్నిసార్లు చెప్పుకుని ఉంటాం.? ఎప్పుడైనా ఆలోచించారా.! ఎందుకంటే అప్పుడప్పుడూ మనం అబద్ధాలు చెబుతుంటాం. ఉద్యోగానికి ఆలస్యంగా వచ్చినా.. లేక చెప్పకుండా సెలవు తీసుకున్నప్పుడు గానీ మనం సాకులు చెబుతుంటాం. ఇలాంటి సమయాల్లో తప్పించుకునేందుకు అబద్దాలను ఆశ్రయంగా తీసుకుంటాం.

వీటి నుంచి కొన్నిసార్లు ప్రయోజనం పొందినప్పటికీ.. ఇంకొన్నిసార్లు అయితే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కొంతమంది అబద్దాలు చెప్పడం మానరు. ఎందుకంటే.. అలాంటివారు వాటి ద్వారా తమ పని సులభంగా అయిపోతుందని భావిస్తారు. ఇదిలా ఉంటే.. తమ జీవితంలో కష్టం వచ్చినా.. ఎలాంటి క్లిష్టమైన సమస్య ఎదురైనా అబద్దాలు చెప్పనివారు కొందరు ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. అలాంటి రాశులవారు ఉన్నారు. వారు అబద్దాలు చెప్పరట. వారెవరో చూద్దాం..

సింహరాశి:

ఈ రాశివారు ఆవేశపరులు. వారు తమ మాటకు కట్టుబడి ఉంటారు. అంతేకాకుండా వారి తప్పులను నిస్సంకోచంగా ఒప్పుకుంటారు. వీరికి అబద్దం చెప్పడం అంటే మనిషిని అవమానించినట్లే. తప్పు గురించి మాట్లాడటం కంటే మౌనంగా ఉండటానికే వీరు ఇష్టపడతారు. అందుకే చాలామంది వీరిని స్వార్ధపరులని అనుకుంటారు. కానీ నిజం వాస్తవికతకు చాలా దూరంగా ఉంటుంది. వీరు అబద్దాలతో బంధాన్ని నిలబెట్టుకోవాలని అనుకోరు. ఎప్పుడూ నిజాన్నే మాట్లాడతారు.

మీనరాశి:

ఈ రాశివారు కఠినంగా, మొరటగా కనిపించినప్పటికీ.. నిజాలు మాత్రమే చెబుతారు. అబద్ధాలు చెప్పి ఇతరుల మనసును గెలుచుకోవడం వారి వ్యక్తిత్వంలోనే లేదు.

కుంభరాశి:

ఈ రాశివారు నిజాయితీపరులు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా అబద్దాలను చెప్పరు. ప్రతీ విషయం సింపుల్‌గా, స్పష్టంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఈ గుణమే అతడి పట్ల ఇతరులు ఆకర్షితులయ్యేలా చేస్తుంది. కొన్నిసార్లు వీరు చెప్పే నిజం.. వారిపై భారాన్ని మోపినా.. ఎప్పుడూ సత్యం వైపే నిలబడతారు.

గమనిక: ఈ వార్త మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.