Viral Video: న్యాయం కోసం వచ్చిన వృద్దుడిపై ఎస్ఐ దాడి.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాష్టీకం..!
న్యాయం కోసం వచ్చిన ఓ వృద్దుడిపై ఎస్ఐ దాడి చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. తన కూతురికి అన్యాయం చేసిన మరో పెళ్లి చేసుకున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలని అడిగేందుకు వచ్చిన వ్యక్తినే చితకబాదారు పోలీసులు.

SI attacks an Old Man: న్యాయం కోసం వచ్చిన ఓ వృద్దుడిపై ఎస్ఐ దాడి చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. తన కూతురికి అన్యాయం చేసిన మరో పెళ్లి చేసుకున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలని అడిగేందుకు వచ్చిన వ్యక్తినే చితకబాదారు పోలీసులు. కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్య , పాపమ్మ దంపతుల కుమార్తె యాదమ్మకు పెద్దాపూర్ గ్రామానికి చెందిన పర్వతాలుతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొద్దిరోజు కాపురం చేసిన దంపతులు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో పర్వతాలు రెండవ వివాహం చేసుకోవడంతో యాదమ్మ వారి బంధువులు అల్లుడు పర్వతాలను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. చివరకు ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురికి అన్యాయం చేసి, తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడిగేందుకు పోలీసుస్టేషన్ కు వచ్చిన యాదమ్మ తండ్రిని ఎస్ఐ నర్సింహులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చితకబాదాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న బంధువులు సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఇలాంటి దారుణానికి పాల్పడ్డ ఎస్‌ఐపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also…