AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..

పగ.. చంపేయాలన్నంత పగ. ఒక్కసారి చూస్తే చాలు వెంట పడి వేటాడి అంతం చేయాలన్నంత పగ. ఇదంతా మనుషుల గురించి కాదు.. పక్షుల గురించి అందులోను కాకుల గురించి అవును కాకులే.. ఒక్కసారి పగ పట్టాయంటే 17 ఏళ్ల వరకు మనిషి ముఖాన్ని మర్చిపోవు.. మనిషినే కాదు తమకు హాని చేసిన ఏ జంతువును కూడా కాకులు మర్చిపోవు. ఏది మేము చెపుతున్న మాట కాదు నిపుణులు చెప్తున్నా మాట..

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..
Do Crows Hold Grudges
Naresh Gollana
| Edited By: |

Updated on: May 09, 2026 | 2:05 PM

Share

మనుషుల్లో స్వార్థం ఉంటుంది. పగ, ప్రతికారాలతో రగిలి పోవడం మనుషుల్లో సర్వ సాధారణం. మనుషుల్లాగే పాములు కూడా పగ పడతాయి అని చెబుతూ ఉంటారు. అయితే పక్షులు కూడా పగపడుతాయంట. అందులో ముఖ్యముగా కాకి కూడా పగపడుతుందంట. వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పర్యావరణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జాన్ మార్స్లఫ్ చేసిన పరిశోధనలో ఈ విషయం రుజువు అవగా.. తాజాగా జువెలాజికల్ సొసైటీ అఫ్ లండన్ జర్నల్ లో ప్రచురితమైంది. కాకులు పగ తీర్చుకుంటాయా అని పరీక్షించడానికి చేసిన ఒక ప్రయోగంలో ఏ విషయాలు బయట పడ్డాయి. దెయ్యం ముసుగు ధరించి.. ఏడు కాకుల్ని పట్టుకున్నారు.. వాటి రెక్కలపై కొన్ని గుర్తులు గీసి, గాయాలు లేకుండా వదిలేశారు. అలా వదిలిపెట్టిన తర్వాత కూడా కాకులు ప్రొఫెసర్ జాన్ మార్స్లఫ్‌ను వెంబడించాయి. ప్రతిసారి ఆయన క్యాంపస్‌లో ముసుగు ధరించి వెళ్లినప్పుడల్లా కాకులు ఆయనపై దాడి చేసేవట. మార్స్లఫ్ తన పరిశోధన ద్వారా క్షీరదాల్లో ఉండే అమిగ్డాలా లాంటి మెదడు భాగం కాకులకు కూడా ఉందని కనుగొన్నారు. ఇది భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. కాకులు మానవ ప్రవర్తనను గమనించడమే కాకుండా ముఖాలను కూడా గుర్తుపట్టగలవని ఆయన తన పరిశోధనలతో వెల్లడించారు.

పక్షులలో కాకులు చాలా తెలివైనవని. ప్రమాదాలను ముందే పసిగడుతాయని.. ఆహారాన్ని సంపాదించుకునే విషయంలోనూ తెలివిగా ప్రవర్తిస్తాయని తేలింది. కాకులు కేవలం పక్షులు మాత్రమే కాదు అవి అసాధారణ జ్ఞాపకశక్తి కలిగిన జీవులని తేలింది. తమకు మేలు చేసే మనుషులకు ఇవి కృతజ్ఞతగా చిన్న చిన్న వస్తువులను కానుకలుగా ఇస్తాయంట. కాకులు తమకు లభించే ప్రేమకు కృతజ్ఞతగా మెరిసే వస్తువులు, సీసా మూతలు, గులకరాళ్లు వంటివి ఆహారం ఉన్న చోట వదిలి వెళ్తుంటాయి. మనుషులతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు ఇవి ఇలా ఆలోచిస్తాయి. తాము తెచ్చిన వస్తువు అవతలి వారికి నచ్చిందో లేదో కూడా అవి నిరంతరం గమనిస్తుంటాయి. కాకులకు మనుషులలాగే కృతజ్ఞతా భావం ఉంటుందని శాస్త్రీయంగా పూర్తిస్థాయిలో నిరూపితం కానప్పటికీ.. వాటి తెలివితేటలను మాత్రం తక్కువ అంచనా వేయలేం. అడవిలోనైనా, ఊరిలోనైనా పరిస్థితులకు అనుగుణంగా జీవించే ఈ పక్షులతో స్నేహం చేయడం ఒక మధురమైన అనుభూతి.

ఎక్కడైనా కాకి చనిపోతే, వెంటనే పదులు, వందల సంఖ్యలో కాకులు గుమిగూడుతాయి. గట్టి గట్టిగా అరుస్తాయి. ఈ పద్దతిని బర్డ్ వరల్డ్ లో Crow funeral లేదంటే cacophony display అంటారు. ఎందుకు ఇలా చేస్తాయంటే.. ఒక కాకి చచ్చిపోతే.. దాన్ని చూసిన మొదటి కాకి గట్టిగా అరుస్తుంది. దాన్ని అలారం క్లాక్ అని పిలుస్తారు. ఆ సౌండ్ విని పదులు, కొన్నిసార్లు వందల సంఖ్యలో కాకులు ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. అవి చచ్చిన కాకి చుట్టూ కూర్చుని లేదంటే గాలిలో తిరుగుతూ గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం కాకులలో చాలా గందరగోళం, భయం కలిగిస్తుంది. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ అరుపులు కొనసాగుతాయి. ఆ తర్వాత కాకి ఎలా చనిపోయింది? కారణం ఏంటి? అనే విషయాలను గుర్తించే ప్రయత్నం చేస్తాయి. ఇతర కాకులకు ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని అని గట్టిగా సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. మొత్తంగా చనిపోయిన కాకి దగ్గర మిగతా కాకులు అరవడం వెనుక బాధ కాదు, సర్వైవల్ స్ట్రాటజీ ఉంటుందంట. ఒక్కమాటలో చెప్పాలంటే చచ్చిన కాకి చుట్టూ మిగతా కాకులు ప్రమాదం ఏంటో ఇన్వెస్టిగేట్ చేసి, భవిష్యత్తులో జాగ్రత్త పడటానికి సమావేశం అయినట్లుగా భావించాలని నిపుణుల పరిశోధనాల్లో తేలింది.

Follow Us