AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?

హైదరాబాద్ నగరవాసులు ఈరోజు ఒక అపురూపమైన ఖగోళ దృశ్యాన్ని వీక్షించారు. మధ్యాహ్నం సరిగ్గా 12:12 గంటలకు సూర్యుడు నడినెత్తిపైకి రావడంతో, వస్తువుల నీడలు మాయమయ్యే 'జీరో షాడో డే' (శూన్య నీడ దినోత్సవం) సంభవించింది. సూర్యకిరణాలు నిలువుగా పడటం వల్ల నిమిషం పాటు నీడలు కనిపించకుండా పోయాయి. భూమి తన అక్షంపై వంగి ఉండటం వల్ల ఏటా రెండుసార్లు ఈ వింత జరుగుతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు బిర్లా ప్లానిటోరియం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు ఈ వింతను మిస్ అయిన వారు మళ్లీ ఆగస్టు ..

హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?
Zero Shadow Day HyderabadImage Credit source: tv9 telugu
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: May 09, 2026 | 12:46 PM

Share

ఈరోజు హైదరాబాద్ వాసులు ఒక అద్భుతమైన ఖగోళ వింతను చూశారు. దీనిని ‘జీరో షాడో డే లేదా ‘శూన్య నీడ దినోత్సవం అని పిలుస్తారు. సంవత్సరంలో రెండు సార్లు సూర్యుడు సరిగ్గా మన నెత్తి మీదికి వస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు నిలువుగా పడటం వల్ల, భూమిపై నిటారుగా ఉన్న ఏ వస్తువు నీడ కూడా పక్కకు పడకుండా, సరిగ్గా ఆ వస్తువు కిందనే ఉండిపోతుంది. దీనివల్ల వస్తువుల నీడలు మాయమైనట్లు కనిపిస్తాయి.

సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేశాము.సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటలకు మన నీడ మయం అయింది.ఈ సన్నివేశం కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తుంది.

భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీల వంపుతో తిరగడం వల్ల, సూర్యుడు ఉత్తరాయణం మరియు దక్షిణాయనం మధ్య కదులుతున్నట్లు కనిపిస్తాడు. ఈ క్రమంలో ఉత్తర అక్షాంశం 23.5 మరియు దక్షిణ అక్షాంశం మధ్య ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ జీరో షాడో డే సంభవిస్తుంది. హైదరాబాద్ భౌగోళికంగా ఈ పరిధిలోనే ఉండటం వల్ల మనకు ఈ అవకాశం కలిగింది.

ఇవి కూడా చదవండి

నగరంలోని బిర్లా ప్లానిటోరియంతో పాటు పలు విద్యా సంస్థలు ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.మీరు ఈ వింతను మిస్ అయితే ఆగస్టు 3వ తేదీన కూడా ఇంచుమించు మధ్యాహ్నం 12:20 నుండి 12:24 గంటల మధ్య ఈ దృశ్యాన్ని చూడవచ్చు.అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us