Viral Video: ఓరీ దేవుడో..ఇదేం పొంగురా సామీ..! ఇది పుచ్చకాయనా లేదంటే..
వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఎక్కువగా పుచ్చకాయలను తింటుంటాం. అయితే, మీరు కొనే పుచ్చకాయ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజా, తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక పుచ్చకాయ నుండి తెల్లటి నురుగు బయటకు రావడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

గౌరవ్ తనేజా షేర్ చేసిన వీడియోలో ఒక పుచ్చకాయ టేబుల్‌పై ఉండగా దాని ఒక వైపు నుండి దట్టమైన నురుగు నెమ్మదిగా బయటకు చిమ్ముతోంది. అది చూస్తుంటే ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఏమిటి? రసాయనాల ప్రభావమా లేక మరేదైనా? అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై వేల సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
అసలు వియం ఏంటంటే.. పుచ్చకాయ పరిమాణంలో పెద్దదిగా ఉండటం వల్ల, రిఫ్రిజిరేటర్‌లో స్థలం లేకపోవడంతో తన భార్య ఆ పుచ్చకాయను బయట వంటగది కౌంటర్‌పై వదిలేసిందని తనేజా పేర్కొన్నాడు. అయితే, మరుసటి రోజు ఆ పండులోంచి ధారగా నురుగు రావడం ప్రారంభించింది. ఉదయం వారు చూసినప్పటి నుండి రాత్రి పొద్దుపోయేదాకా ఆ నురుగు ఆగకపోవడంతో, తనేజా ఆ పుచ్చకాయను దుకాణదారుడి వద్దకు తీసుకువెళ్లాడు. అతను దానిని తన భార్యకు అమ్మేశాడు. పుచ్చకాయకు ఎలాంటి రసాయనం పూయలేదని, పండు లోపల గ్యాస్ ఏర్పడిందని దుకాణదారుడు వివరించాడు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయలో నురుగు రావడానికి ప్రధాన కారణం ఫెర్మెంటేషన్ (Fermentation) లేదా కిణ్వ ప్రక్రియ. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, పుచ్చకాయ లోపల ఉండే సహజ చక్కెరలు కుళ్ళిపోవడం మొదలవుతాయి. లోపల బ్యాక్టీరియా లేదా ఈస్ట్ చేరినప్పుడు అవి కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను విడుదల చేస్తాయి. లోపల ఒత్తిడి పెరిగి, ఆ వాయువులతో పాటు నురుగు బయటకు వస్తుంది. లేదంటే, పండు త్వరగా పండటానికి లేదా ఎర్రగా కనిపించడానికి కొన్నిసార్లు వ్యాపారులు రసాయన ఇంజెక్షన్లు ఇస్తుంటారు. దీనివల్ల కూడా ఇలాంటి వింత పరిస్థితులు ఏర్పడవచ్చునని చెబుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఒకవేళ మీరు కొన్న పుచ్చకాయ నుండి నురుగు రావడం లేదా వింత వాసన రావడం గమనిస్తే, దానిని అస్సలు తినకండి. అది విషపూరితంగా మారి ఉంటుంది. పండును కోసినప్పుడు లోపల మెత్తగా లేదా పుల్లటి వాసన వచ్చినా అది పాడైపోయిందని అర్థం. పండ్లు కొనేటప్పుడు వాటి తాజాదనాన్ని పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. గౌరవ్ తనేజా షేర్ చేసిన ఈ వీడియో వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి ఉపయోగపడుతోంది.




