టాలీవుడ్‌ను ఏలేస్తుంది అనుకున్నారు.. చూస్తే.. పత్తా లేకుండా పోయింది
Rajitha Chanti
Pic credit - Instagram
09 May 2026
టాలీవుడ్ లో 'ఉప్పెన' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' వంటి హిట్లతో హ్యాట్రిక్ సాధించింది. అయితే, ఏ స్టార్ హీరోయిన్ కైనా సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
కృతి విషయంలో కూడా ఇదే జరిగింది. హ్యాట్రిక్ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఇప్పుడు ఆమె కెరీర్ ను ఇబ్బందుల్లో నెట్టింది.
'వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'కస్టడీ' ఇలా ఆమె నటించిన దాదాపు ఐదు ఆరు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి.
ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అని పిలిపించుకున్న ఈ భామ, ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్రను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో తెలుగు సినీరంగంలో ఆమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది.
వరుస పరాజయాలు కేవలం ఆమె క్రేజ్ పైనే కాకుండా, ఆమె తీసుకునే రెమ్యునరేషన్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సినీ వర్గాల సమాచారం.
తెలుగులో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో కృతి శెట్టి ఇప్పుడు తమిళ, మలయాళ చిత్రాలపై దృష్టి సారించింది. అక్కడ కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైంది.
ఒక మంచి హిట్ పడితే మళ్లీ ఫామ్ లోకి రావడం కృతికి పెద్ద కష్టమేమీ కాదు. టాలెంట్ ఉన్న నటి కావడంతో, సరైన కథ పడితే ఆమె మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంది.