నా బాయ్ ఫ్రెండ్ అమ్మాయిల పిచ్చోడు.. ఎంతో మందితో ఎఫైర్స్.. హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

09 May 2026

తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా గుర్తింపు పొంది, తెలుగులోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ప్రియా భవానీ శంకర్.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న రకరకాల వార్తలపై తాజాగా స్పందించారు.

ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితం, గత కొంతకాలంగా వినిపిస్తున్న బ్రేకప్ రూమర్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాలేజీలో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని.. కానీ అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. 

అలాంటి టాక్సిక్ బంధంలో తాను ఎక్కువ రోజులు ఉండలేకపోయానని.. అందుకే అతడికి బ్రేకప్ చెప్పానని.. అలాంటి బంధం అవసరం లేదని తెలిపింది. 

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. న్యూస్ రీడర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియా భవానీ శంకర్. 

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. ఆ క్రేజ్‌తో వెండితెరపై అడుగుపెట్టి 'మేయాద మాన్', 'కడైకుట్టి సింగం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగులో సంతోష్ శోభన్ సరసన 'కళ్యాణం కమనీయం', విశ్వక్ సేన్ పక్కన 'గామి' చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.