AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

భారతీయ వంటింట్లో అల్లం లేని పోపు పెట్టె ఉండదు. కేవలం రుచి కోసమే కాకుండా, అల్లానికి ఉన్న ఔషధ గుణాల వల్ల దీనిని ఆయుర్వేదంలో మహా ఔషధం అని పిలుస్తారు. అయితే అల్లం టీ లేదా కూరల్లో వేయడమే కాకుండా, భోజనానికి ముందు పచ్చి అల్లాన్ని నమలడం వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా? భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: May 09, 2026 | 12:55 PM

Share
 భోజనానికి అరగంట ముందు చిన్న అల్లం ముక్కను ఉప్పుతో కలిపి నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  భోజనానికి సుమారు 20 నుండి 30 నిమిషాల ముందు ఒక చిన్న అల్లం ముక్కపై కొద్దిగా సైంధవ లవణం (Rock Salt) లేదా సాధారణ ఉప్పు చల్లుకుని నమలాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

1 / 5
అల్లం జీర్ణక్రియను వేగవంతం చేసే ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆకలిని పెంచడమే కాకుండా, తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక సహజ సిద్ధమైన మందులా పనిచేస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా అల్లం కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
చాలామందికి ఆకలి సరిగ్గా వేయదు. అలాంటి వారు భోజనానికి ముందు అల్లం నమలడం వల్ల జఠరాగ్ని (Digestive fire) ప్రజ్వరిల్లి, ఆకలి బాగా వేస్తుంది. కడుపులో గ్యాస్ చేరడం లేదా తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపించడం వంటి సమస్యలను అల్లం సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇది ప్రేగుల్లోని వాయువులను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

3 / 5
ప్రయాణాల్లో లేదా ఉదయాన్నే కలిగే వికారం (Morning Sickness) తగ్గించడానికి అల్లం ఒక అద్భుతమైన చిట్కా. భోజనానికి ముందు దీనిని తీసుకోవడం వల్ల వాంతి వచ్చే అనుభూతి తగ్గుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

4 / 5
అయితే, ఎసిడిటీ ఎక్కువగా ఉన్నవారు లేదా అల్సర్స్ ఉన్నవారు నేరుగా అల్లం తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యంగా ఉన్నవారు రోజువారీ అలవాటుగా దీనిని మార్చుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

5 / 5
Follow Us
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా

భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..

ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!

అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..

రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?

ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..

హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?

మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి ముందు నడుస్తున్నారా? ఇది తెలుసుకో

వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!

IPL దెబ్బకు అంతా ఖాళీ.. ఎంత భయమో..?
IPL దెబ్బకు అంతా ఖాళీ.. ఎంత భయమో..?