AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్

Bike Stunts in hyderabad: బహిరంగ రహదారులపై ప్రాణాలకు ప్రమాదం కలిగే విధంగా బైక్ స్టంట్లు నిర్వహిస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

Hyderabad: బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్
Bike Stunts
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 09, 2026 | 11:15 AM

Share

హైదరాబాద్: బహిరంగ రహదారులపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ మధ్య ప్రధాన రహదారులపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు (స్టంట్లు) చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరు కేవలం తమ ప్రాణాలనే కాకుండా, పాదచారుల, ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్-జాగ్ డ్రైవింగ్, వీలీలు వంటి స్టంట్లు చేస్తూ వాహనాల నుంచి నిప్పురవ్వలు వచ్చేలా రాపిడి చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఈ ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు:

  • సయ్యద్ షాహెద్ (19): ఫంక్షన్ హాల్‌లో వాటర్ సప్లై పని, నివాసం: హసన్ నగర్.
  • షేక్ నసీర్ హుస్సేన్ (19): బేకరీ వ్యాపారం, నివాసం: హసన్ నగర్.
  • షేక్ జునైద్ (18): విద్యార్థి, నివాసం: హసన్ నగర్.
  • మొహమ్మద్ బిన్ ఇసా (17): విద్యార్థి, నివాసం: కాలాపత్తర్.
  • (పైన పేర్కొన్న నలుగురు గతంలో బహదూర్‌పురా పి.ఎస్ పరిధిలో ఇటువంటి బైక్ స్టంట్ల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.)
  • అబ్దుల్ సమద్ (20): బట్టల దుకాణం పని, నివాసం: కాలాపత్తర్.
  • మొహమ్మద్ అర్బాజ్ హుస్సేన్ ఖాన్ (22): వాటర్ ప్లాంట్ పని, నివాసం: ఎన్.టి.ఆర్ నగర్.
  • (ఇతనిపై గతంలో అత్తాపూర్ పి.ఎస్‌లో పోక్సో (POCSO) కేసు నమోదై ఉంది.)

స్వాధీనం చేసుకున్న ఆస్తులు:

  • 06 మొబైల్ ఫోన్లు
  • మైస్ట్రో డీలక్స్ స్కూటీ (TS 12 EC 0002)
  • డియో స్కూటీ (TS 12 EL 0755)
  • (మొత్తం విలువ సుమారు రూ. 1,50,000/-)

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ ఆపరేషన్ నిర్వహించిన డిసిపి వైభవ్ గైక్వాడ్ (టాస్క్ ఫోర్స్), రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసు బృందాలను అభినందించారు.

ముఖ్య గమనిక (అడ్వైజరీ):

తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని, చట్టవిరుద్ధమైన, ప్రాణాపాయం కలిగించే ఇటువంటి పనులకు దూరంగా ఉండేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచించారు. రహదారులపై ఎక్కడైనా ప్రమాదకర డ్రైవింగ్ లేదా బైక్ స్టంట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరడమైనది.

బైక్ స్టంట్స్ వీడియో..

Follow Us