Smita Sabharwal: పొలిటికల్ టర్న్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్..
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటికి డిప్యూటీ తహశీల్దార్ వెళ్లిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకున్న టీకాంగ్రెస్ కేసీఆర్ సర్కార్‌లో మహిళలకు రక్షణలేదని ఆరోపించింది.
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌కు రెండు రోజుల క్రితం చేదు అనుభవం ఎదురైంది. సరిగ్గా అదే రోజు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లో డిప్యూటీ తహశీల్దార్ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. సామాన్య మహిళలకే కాదూ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లకూ రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్మితా సబర్వాల్ జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం రాత్రి పదకొండున్నర గంటలకు స్నేహితుడితో కలిసి డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్.. స్మితా ఇంటికి వెళ్లాడు. నేరుగా వెళ్లి డోర్ కొట్టాడు. తలుపులు తీశాక ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలియక స్మితా సబర్వాల్ షాకయ్యారు. ఎవరు..? ఏంటి..? ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అనుమానంతో కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగిందంటే..
జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ తహశీల్దార్ ఒకరు హల్‌చల్ చేశాడు.. ఏకంగా ఐఏఎస్ స్మితాసబర్వాల్ ఇంట్లోకి చొరబడే యత్నం చేయడం కలకలం రేపింది. డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డాడు. అతణ్ణి చూసిన అధికారిణి.. కేకలు వేడయంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మేడ్చెల్ మల్కాజ్‌గిరికి చెందిన డిప్యూటీ తహశీల్దార్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందితో కూడా ఆనంద్ దురుసుగా ప్రవర్తించాడు. అయితే, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి ఉన్న స్మితా సబర్వాల్ ఇంట్లోకి.. అర్ధరాత్రివేళ డీటీ వెళ్లడం కలకలం రేపింది. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడడంపై.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో స్మితా సబర్వాల్ ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ ఆనందర్ కుమారెడ్డి, స్నేహితుడు బాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సీఎం కార్యదర్శి ప్రాణాలకు రక్షణ లేకుంటే ఎలా?
రాత్రి భయానక అనుభవం ఎదురైంది. ఆ సమయంలో ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించానంటూ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. మనం ఎంత సురక్షితంగా ఉన్నా నిత్యం డోర్, లాక్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తూనే వెంటనే 100 కాల్ చేయాలన్నారు. స్మితా అగర్వాల్ చేసిన ట్వీట్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. స్మితా సబర్వాల్ కామెంట్లు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకి అద్దం పడతున్నాయన్నారు. సీఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదంటే సీఎం కేసీఆర్ ఎవరిని కాపాడుతారని రేవంత్ ప్రశ్నించారు. ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయం భయంగా బతకండని స్మిత సబర్వాల్ అనడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడానికి నిదర్శనం అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగం గురించి మాట్లాడేందుకే వెళ్లాడా?
ఉద్యోగం గురించి మాట్లాడేందుకు స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లానని డిప్యూటీ తహశీల్దార్ పోలీసులకు వివరించాడు. కానీ అందులో నిజమెంత? ఉద్యోగం గురించి అయితే అర్ధరాత్రి సమయంలో వెళ్లాల్సిన అవసరం ఏముంది? పోలీసులు మాత్రం వేర్వేరు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం