Telangana Assembly: ‘గవర్నర్ ప్రసంగమంతా తప్పులు, అసత్యాలే’.. అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల తూటాలు..
తెలంగాణలో నాలుగవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా నిన్నటి గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి బలపరిచారు. బీఆర్ఎస్ ఓటమి తరువాత కొలువు తీరిన అసెంబ్లీలో మొదటి చర్చ జరుగుతుండటంతో అందరిలో తీవ్ర ఆసక్తిరేగుతోంది.

తెలంగాణలో నాలుగవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా నిన్నటి గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి బలపరిచారు. బీఆర్ఎస్ ఓటమి తరువాత కొలువు తీరిన అసెంబ్లీలో మొదటి చర్చ జరుగుతుండటంతో అందరిలో తీవ్ర ఆసక్తిరేగుతోంది. అయితే శాశనమండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ తెలిపారు.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
బీఅర్ఎస్ పార్టీ తరపున గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఅర్ ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ఆ తరువాత గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందన్నారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందంటూ విమర్శించారు. మేము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమే అని చెబుతూ.. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు నీటితో పాటూ కరెంట్ కి కూడా దిక్కు లేదు అంటూ మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అసత్యాలతో అభూత కల్పనలాగా ఉందన్నారు. కొత్త ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇద్దాం అని కేసీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ మంత్రుల కామెంట్స్..
దీనిపై స్పందించారు కాంగ్రెస్ మంత్రులు. కేటీర్ మాటలను తిప్పికొట్టారు పొన్నం ప్రభాకర్. ఆ తరువాత తెలంగాణ డిప్యూడీ సీఎం, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడారు. మొదటి రోజే ప్రభుత్వంపై మాటల దాడి చేస్తారా అని ప్రశ్నించారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ది మొత్తం జరిగిందని కేటీఆర్ చేబుతున్నారు.. కాంగ్రెస్ హయాంలో ఏ ప్రాంతానికి నీళ్లు రాలేదో చెప్పాలని అడిగారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. మిగిలు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ. 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మిగిల్చారు అని ఘాటుగా స్పందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..