Telangana Assembly: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపాలని కోరాం- హరీష్‌రావు
ఆ రోజుల్లో నీళ్ల కోసం ఎంతో కొట్లాడామని, అక్రమంగా తరలిపోతున్న నది జలాలపై పోరాటం చేశామన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపాలని కోరామని, ఆరు కారణాలతో మేం ఆ రోజు రాజీనామా చేశామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవపట్టించేలా మాట్లాడారని అన్నారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడలేదు..

తెలంగాణలో నాలుగవ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా నిన్నటి గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి బలపరిచారు. బీఆర్ఎస్ ఓటమి తరువాత కొలువు తీరిన అసెంబ్లీలో మొదటి చర్చ జరుగుతుండటంతో అందరిలో తీవ్ర ఆసక్తిరేగుతోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవపట్టించేలా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అలాగే ఆ రోజుల్లో నీళ్లపై, ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. ఆ రోజుల్లో నీళ్ల కోసం ఎంతో కొట్లాడామని, అక్రమంగా తరలిపోతున్న నది జలాలపై పోరాటం చేశామన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపాలని కోరామని, ఆరు కారణాలతో మేం ఆ రోజు రాజీనామా చేశామని అన్నారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడలేదు. ఒక్క పీజేఆర్ తప్ప.. ఎవరు పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేదని హరీష్‌రావు గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్ అని, అనాడు మేం గెలిచి.. కాంగ్రెస్‌పార్టీకి భిక్ష పెట్టామన్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ బిల్లుపెడితే.. యూపీఏ కూటమిలో చేరుతామని కేసీఆర్ చెప్పారని అన్నారు. షిప్పింగ్ పోర్ట్‌పోలియా కేసీఆర్ అడగకుండానే ఇచ్చారు.. పదవులను గడ్డిపోచలా త్యజించిన చరిత్ర కేసీఆర్, బీఆర్‌ఎస్ ది అని గుర్తు చేశారు.
ఆ రోజుల్లో అక్రమంగా నది జలాలను రాయలసీమకు తరలించుకుపోతున్నందున రాజీనామా చేశామని గుర్తు చేశారు. తెలంగాణను సాధించుకునేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని, తీవ్రంగా కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కరెంటు ఇవ్వనని చెప్పినప్పుడు పోరాటం చేసింది ఎవరిని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..