South Central Railway: ఈ ప్రాంతాల మధ్య రైలు ప్రయాణం సులభం కానుంది.. అసలు కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్ - నడికుడి రైలు మార్గంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. మూడు దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్న బీబీనగర్ - నడికుడి రైలు మార్గంలో డబ్లింగ్ పనులకు ముందడుగు పడింది. ఈ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 239కి.మీ డబ్లిం గ్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,853కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్ – నడికుడి రైలు మార్గంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. మూడు దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్న బీబీనగర్ – నడికుడి రైలు మార్గంలో డబ్లింగ్ పనులకు ముందడుగు పడింది. ఈ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 239కి.మీ డబ్లిం గ్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,853కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.
బీబీనగర్- నడికుడి రైలు మార్గం సింగిల్ ట్రాక్‌లో..
దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక ఆదాయం బీబీనగర్ – నడికుడి రైలు ద్వారానే సమకూరుతోంది. ఈ రైలు మార్గంలో ప్రయాణికుల సంఖ్య పెరిగినా, డబుల్ లైన్ లేకపోవడంతో రైళ్ల రాకపోకలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, వైజాగ్, చెన్నై, కేరళ, తమిళనాడు, ఒడిషాలతో పాటు పలు రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రంలోని షిర్డీ, కేరళ వంటి ప్రాంతాలకు వారానికి ఒక రైలు మాత్రమే నడుస్తోంది. దీంతో ఈ మార్గం గుండా వివిధ పట్టణాలు, రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైళ్ల వేగంలో నియంత్రణ..
ఈ మార్గం సింగిల్ ట్రాక్ లైన్ కావడంతో ఒక రైలు వస్తే మరో రైలును ముందు స్టేషన్లో నిలపాల్సి వస్తుంది. సింగిల్ రైల్వే లైన్ ఉండటంతో స్పీడ్‌గా వెళ్లే రైళ్ల కోసం కొన్ని రైళ్లను చిన్న స్టేషన్లలో చాలా సమయం నిలిపి వేస్తున్నారు. క్రాసింగ్ కోసం ప్యాసింజర్ రైళ్లులు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో బీబీనగర్-నడికుడి సింగిల్ ట్రాక్ వినియోగం 148.25శాతం ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న సింగిల్ ట్రాక్ గరిష్ఠ వేగం 130కి.మీలు మాత్రమే. ఇప్పటికే ఈ మార్గంలో 160కి.మీల వేగ సామర్ధ్యం ఉన్న రైళ్లు వేగాన్ని తగ్గించుకుని ప్రయాణిస్తున్నాయి.
భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ..
బీబీనగర్ – నడికుడి రైలు మార్గం230కిలో మీటర్లకు పైగా నిర్మాణ వ్యయానికి రూ.2853.23 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దశల వారీగా పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. డబ్లింగ్ పనుల్లో భాగంగా తొలుత 48 కిలో మీటర్ల మేర రూ.647 కోట్ల అంచనా వ్యయంతో ఆగస్టులో పనులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు నల్లగొండ జిల్లాలో భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలం వట్టిమర్తి, నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు, నల్లగొండ మండలం అన్నెపర్తి, చర్లపల్లి, మర్రిగూడ, పానగల్లు, గొల్లగూడ, తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి, జంగారెడ్డిగూడెం, రాజుపేట, తిప్పర్తి మండల కేంద్రాల పరిధిలో సింగిల్ ట్రాక్ వెంట మొత్తం 26హెక్టార్లకు పైగా భూమి సేకరించనుంది.
రెండో లైన్‌తో తగ్గనున్న దూరభారం..
ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రైళ్ల వేగం పెరగడంతో పాటు అదనపు రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది. దీంతో సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి మధ్య దూరభారం తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైకి విజయవాడ మార్గంతో పోలిస్తే నడికుడి -బీబీనగర్ మార్గంలో సుమారు 46కి.మీల దూరం తగ్గుతుంది. ఖాజీపేట, ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తే సికింద్రాబాద్, విజయవాడ మధ్య దూరం 350కి.మీలు. బీబీనగర్ – నడికుడి మార్గంలో విజయవాడకు దూరం 336కి.మీలు. డంబ్లింగ్ చేపడితే బీబీనగర్, నడికుడి మార్గం రద్దీగా మారనుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపారాభివృద్ధికి ప్రయోజనం..
ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే..వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతయ్యే సిమెంట్, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభం కానుంది. ఈ మార్గంలోనే నడికుడి, జగ్గయ్యపేట, విష్ణుపురం, జాన్‌పహాడ్ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..