Dengue Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఆస్పత్రులకు క్యూలు కడుతున్న బాధితులు
డెంగ్యూ జ్వరాలు డేంజర్‌బెల్ మోగిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో.. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. గత 15 రోజుల్లో ఆసుపత్రుల్లో, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురువడంతో దోమలు పెరిగే అవకాశం ఉందని... ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు డాక్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను డెంగ్యూ భయపెడుతుంది. ఒక్కసారిగా కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులు తీవ్రమైన ఎండలు, మళ్లీ భారీ వర్షాల కారణంగా దోమలు పెరిగిపోతున్నాయి.

డెంగ్యూ జ్వరాలు డేంజర్‌బెల్ మోగిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో.. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. గత 15 రోజుల్లో ఆసుపత్రుల్లో, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురువడంతో దోమలు పెరిగే అవకాశం ఉందని… ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు డాక్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను డెంగ్యూ భయపెడుతుంది. ఒక్కసారిగా కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులు తీవ్రమైన ఎండలు, మళ్లీ భారీ వర్షాల కారణంగా దోమలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు అపరిశుభ్రమైన వాతవరణం ఉండటం ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకేసారి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. దీంతో మనుషులు నీరసించిపోతున్నారు. ఆసుపత్రులో ఉంటూనే డెంగ్యూ నుంచీ బయటపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా డెంగ్యూ ప్రభావం ఉంటుంది.
కరీంనగర్ లోని చిన్న పిల్లల ఆసుపత్రిలో సైతం డెంగ్యూతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. నాలుగైదు రోజులైనా జ్వరం తగ్గడం లేదు. ఒక్కసారిగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో మళ్లీ ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటున్నారు. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్స్ వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లో ఒక్కరికి ఉంటే.. మరోకరికి ఇవి సోకుతున్నాయి. జ్వరంతో పాటుగా దగ్గు, జలుబు సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఇక వృద్ధులు జ్వరం నుంచి బయటపడటం లేదు. సీజనల్ వ్యాధుల మరింత పెరిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా దోముల కారణంగా రోగాలు పెరిగిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ నీరు ఉంటే అందులో డెంగ్యూ దోమలు తయారవుతాయని అంటున్నారు. నీటి తొట్టెలో నీరు విల్వ ఉండటంతో పాటు ఇతర అపరిశుభ్రమైన వాతవరణంతో రోగాలు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ నుండి బయట పడినా కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇదే సమయంలో తాగు నీరు కలుషితం కావడంతో.. మరింత అనారోగ్యానికి గురవుతున్నారు.
క్లోరినేషన్ లేకుండా తాగునీటిని సరఫరా చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు అపరిశుభ్రమైన వాతవరణం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు స్థానికులు. వర్షాకాలంలో డ్రైనేజీ పేరుకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్యానికి గురికావని డాక్టర్లు చెబుతున్నారు. జ్వర ప్రభాత ప్రాంతాల్లో.. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి డెంగ్యూ, వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు అతలకుతలమవుతున్నారు. మరో 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్స్ అంటున్నారు. తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరామని పేషెంట్స్ చెబుతున్నారు. ఏమి తిన్నా కూడా వాంతులు అవుతున్నాయని చెబుతున్నారు. డెంగీతో వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయని డాక్టర్స్ అంటున్నారు. అలాగే దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




