కరీంనగర్‌లో దంచికొడుతున్న ఎండలు

కరీంనగర్‌లో పెద్దపల్లి జిల్లాలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చెరువులు, బావులు కింద వేసుకున్న పంటలు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. వరి, మొక్కజొన్న పంటలు ఎండవేడిమికి ఎండిపోతున్నాయి. పంటల్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పులు చేసి మరీ క్రేన్ల సాయంతో బావులను తవ్విస్తున్నారు. పైపుల ద్వారా నీటిని పొలాలకు అందిస్తున్నారు. అయితే.. రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భజలాలను […]

కరీంనగర్‌లో దంచికొడుతున్న ఎండలు
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 11:26 AM

కరీంనగర్‌లో పెద్దపల్లి జిల్లాలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చెరువులు, బావులు కింద వేసుకున్న పంటలు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. వరి, మొక్కజొన్న పంటలు ఎండవేడిమికి ఎండిపోతున్నాయి.

పంటల్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పులు చేసి మరీ క్రేన్ల సాయంతో బావులను తవ్విస్తున్నారు. పైపుల ద్వారా నీటిని పొలాలకు అందిస్తున్నారు. అయితే.. రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భజలాలను తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ వాటర్‌ను సమృద్ధిగా సరఫరా చేసి పంటలను కాపాడాలని కోరుతున్నారు.