గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఇంటర్ విద్యార్థి
TV9 Telugu Digital Desk | Edited By:
Updated on: Mar 12, 2019 | 12:15 PM
నల్గొండ : ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కాసరబాధ్ గ్రామానికి చెందిన తరుణ్ జిల్లా కేంద్రంలోని ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం జరిగిన పరీక్షను సరిగ్గా రాయలేదన్న మనస్తాపంతో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన తరుణ్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి […]
నల్గొండ : ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కాసరబాధ్ గ్రామానికి చెందిన తరుణ్ జిల్లా కేంద్రంలోని ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం జరిగిన పరీక్షను సరిగ్గా రాయలేదన్న మనస్తాపంతో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన తరుణ్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.