Telangana Congress: కౌన్ బనేగా తెలంగాణ సీఎం.. కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రుల’ పంచాయితీ..

కనకపు సింహాసనమున... సారీసారీ.. శునకపు సింహాసనమున... మళ్లీ సారీసారీ. ఏదైతేనేం... సింహాసనమైతే కామన్. సింహాసనం మీద లీడర్లకుండే యావైతే ఇంకా కామన్. అది గనుక సీఎం సింహాసనమైతే ఇంకాఇంకా కామన్. తెలంగాణాలో సీఎం కుర్చీ అనే పెద్ద సింహాసనం మీద పెద్ద చర్చే షురూ ఐంది. మిగతా పార్టీల్లో సంగతేమోగాని... తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే... నేనే సీఎం అని ప్రకటించేసుకుంటున్నారు. ప్రమాణస్వీకారాలు కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో... ఇక్కడ సింహాలు రెడీ... మరి... సింహాసనమెక్కడ?

Telangana Congress: కౌన్ బనేగా తెలంగాణ సీఎం.. కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రుల’ పంచాయితీ..
Telangana Congress
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 20, 2023 | 10:32 AM

కనకపు సింహాసనమున… సారీసారీ.. శునకపు సింహాసనమున… మళ్లీ సారీసారీ. ఏదైతేనేం… సింహాసనమైతే కామన్. సింహాసనం మీద లీడర్లకుండే యావైతే ఇంకా కామన్. అది గనుక సీఎం సింహాసనమైతే ఇంకాఇంకా కామన్. తెలంగాణాలో సీఎం కుర్చీ అనే పెద్ద సింహాసనం మీద పెద్ద చర్చే షురూ ఐంది. మిగతా పార్టీల్లో సంగతేమోగాని… తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే… నేనే సీఎం అని ప్రకటించేసుకుంటున్నారు. ప్రమాణస్వీకారాలు కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో… ఇక్కడ సింహాలు రెడీ… మరి… సింహాసనమెక్కడ?

తెలంగాణా కాంగ్రెస్‌లో అన్నీ ఆటలూ ఐపొయ్యాయ్… ఇప్పుడు నంబర్ వన్నాట షురూ… కేరాఫ్ గాంధీభవన్. కౌన్ బనేగా తెలంగాణా సీఎం… ఇదే ఖతర్నాక్ గేమ్ షో. బెట్టింగులొక్కటే తక్కువ. ఎందుకంటే అక్కడ పోటీ ఎక్కువ. ఆలూ లేదు చూలూ లేదు అనే సామెత ఇక్కడ సూటవుతుందో లేదో తెలీదు గానీ… ఆలూ చూలూ రెండూ లేకుండానే పెద్ద కుర్చీకి పెద్ద పోటీ ఏర్పడింది. తెలంగాణా కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం కొట్లాట… దాదాపుగా క్లయిమాక్స్‌కు చేరిపోయిందిప్పుడు. ముఖ్యమంత్రికుండాల్సిన క్వాలిటీలు, వాటి మీద కాలిక్యులేషన్లు కూడా రెడీ అయిపోయాయ్..

సీఎం అనే ఆ రెండక్షరాల సౌండ్‌లోనే ఒక మేజిక్కుంది. అందుకే… అది వినిపించీ వినిపించగానే అందరినోళ్లల్లో నీళ్లూరుతున్నాయి. ఒకర్ని చూసి ఇంకొకరు కుర్చీ కోసం చప్పరింతలు మొదలుపెట్టుకున్నారు. అసలీ సీఎం అభ్యర్థి ఎవరు అనే చర్చకు బీజం పడింది మంచిర్యాల సభలో. దళితుడికే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలంటూ కోమట్రెడ్డి వెంకట్రెడ్డి అక్కడ లేవనెత్తిన దళిత్ కార్డ్… పార్టీలో విచిత్రమైన చిచ్చు రేపింది. ఎన్నికల దాకా ఆయన పార్టీలో ఉంటారో ఉండరో ఆయనకే తెలీదు. సో… సీఎం రేసులో ఉండే ఊసే లేదు కనుక… ఇలా దళిత్ మంత్రం ప్రయోగించి పక్కకెళ్లి సినిమా చూస్తున్నారు. దళితుడు సీఎం కావాలనేది తెలంగాణాలో ఆల్రెడీ పాపులరైన రెడీమేడ్ నినాదం. ఫర్ యువర్ ఇన్‌ఫర్మేషన్… కాంగ్రెస్‌లో రెడీమేడ్ దళిత్‌ స్టార్‌ క్యాండిడేట్ ఒకరు ఉండనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కానీ.. దళిత్ సీఎం అనే ఫార్ములా రేవంత్ వర్గానికి ఎలాగూ నచ్చదు. అలాగని ఆ విషయంలో ఆయన బైటపడరు కూడా. తొందరపడి కొన్ని కోయిలలు ముందే కూసినంత మాత్రాన… వాటికి కోరస్ ఇచ్చి దొరికిపోకుండా పీసీసీ చీఫ్‌గా కూసింతైనా హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు రేవంత్. ఐనా… ఎన్నికలు రావాలి.. అందులో పార్టీని జనం మెచ్చాలి.. అరవైడెబ్బై సీట్లయినా రావాలి.. అప్పుడు కదా ఈ సింహాసనం గొడవ. రాష్ట్రంలో పార్టీ పొజిషనేంటి… పవర్లోకొచ్చే ఛాన్సెస్ ఎంతమాత్రం అనే సోయి లేకుండానే.. ఈ సీట్లాట ఏంటి బాసూ మరీ సిల్లీ కాకపోతేనూ!

కాంగ్రెస్ క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్‌

కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా పోటీ చేసే అవకాశాలే లేనప్పుడు డెబ్బై సీట్లు ఎక్కడినుంచొస్తాయ్.. సీఎం కుర్చీ ఎలా దక్కుతుంది అనేది పక్కపార్టీవాళ్లేస్తున్న ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్ రెండూ ఒకే లైన్‌లో వెళ్తున్నాయని, పొత్తు చర్చలు కూడా కంప్లీటయ్యాయని కమలం పార్టీ చేస్తున్న ప్రచారం… కాంగ్రెస్ క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్‌ని పెంచేస్తోంది. వాళ్లు ఎన్నయినా చెప్పనీ… మన దారి మాత్రం రహదారే.. నో పొత్తులు- ఓన్లీ కత్తులు అంటూ కన్విన్సింగ్ మాటలు చెప్పి… ముందుగానే డ్యామేజ్‌ కంట్రోల్ షురూ చేస్తున్నారు రేవంత్‌రెడ్డి.

సీనియర్లు-వలసదారులు అనే కుమ్ములాటతో నిన్నటిదాకా ఉడికిపోయింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్‌రెడ్డికి పోటీగా పార్టీలోనే కొత్త కుంపటి పెట్టి… హైకమాండ్‌కి తలనొప్పి తీసుకొచ్చారు సీనియర్లు. ఇప్పుడా సీనియర్ల గుంపులోంచి మహేశ్వర్‌రెడ్డి అనే ఒక రెక్క ఊడి బీజేపీలో చేరిపోయింది కూడా. కాంగ్రెస్‌ నుంచి కమలం గూటికి వలసల సీజన్ మొదలైందన్న వాసన గుప్పుమంది. బైటినుంచి పొంగులేటి లాంటి బిగ్‌ టిక్కెట్స్ వస్తామన్నా చేర్చుకోకుండా కాళ్లకడ్డం పడుతోంది కాంగ్రెస్‌లో వర్గపోరు.

భట్టి విక్రమార్క లక్ష్యం అదేనా..?

అటు… పాదాల మీద నడిచే యాత్రల సంగతైతే సరేసరి. ఇక్కడ ఎవరి పాదయాత్ర వారిదే. రాహుల్‌ పాదయాత్రకు మద్దతుగా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే.. ఆ పాదాలతో ఎవరెవరు పాదాలు కలపాలి అనే చర్చ గాంధీభవన్‌లో జోరుగా నడిచింది. చివరకు రేవంత్‌రెడ్డి బహుదూరపు బాటసారిగా దాదాపు ఒంటరిగానే నడవాల్సి వచ్చింది. జిల్లాల్లో ఎవరో కొందరు తప్పితే… ఎవ్వరూ రేవంత్‌కి తోడురాలేదు. ఇటు… భట్టివిక్రమార్కుడు కూడా పీపుల్స్‌ మార్చ్‌ అంటూ ఒక టైటిల్‌ పెట్టుకుని తానూ పాదయాత్ర ప్రాక్టీస్ చేసుకున్నారు. సీఎల్‌పీ చీఫ్‌గా తెలంగాణా కాంగ్రెస్‌లో తనకంటూ ఒక పవర్‌సెంటర్‌ ఉందని ప్రూవ్ చేసుకోడానికి చాలానే కష్టపడుతున్నారు భట్టి. ఊరూరూ తిరుగుతున్నా… నాకూ కాళ్లరిగిపోతున్నాయ్ చూడండి… అంటూ సెంటిమెంటల్ ఆయింట్‌మెంట్‌ రాసుకుంటున్నారు. ఇంతకీ… భట్టి పాదయాత్ర లక్ష్యమేంటి… ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం ఎట్సెట్రా ఎట్సెట్రా…! అంతేనా ఇంకేమైనా ఉందా?

సీఎల్‌పీ చీఫే చీఫ్‌మినిస్టర్ అవుతారన్న సెంటిమెంట్‌ కూడా భట్టిని గట్టిగా పట్టేసుకుంది. కాంగ్రెస్‌ మీద తెలంగాణా ప్రజలకు విపరీతమైన ప్రేమాభిమానాలు పెరిగాయ్… ఆ ప్రేమల్లో నేనూ తడిసిపోతున్నా… నాకేం తక్కువ… ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో తప్పేముంది? ముఖ్యమంత్రి పీఠం దక్కితే హోదాలా కాకుండా బాధ్యతగా భావిస్తా అంటూ ఫ్యూచర్‌ ప్లాన్లు కూడా చెప్పేశారు భట్టి.

సీనియర్లు కూడా సింహాసనం వైపే..

సో… భట్టి ఆల్సో ఈజ్ ఇన్ రేస్. గతంలో డీఎస్‌ అండ్ వైఎస్… ఒకరు పీసీసీ చీఫ్ ఇంకొకరు సీఎల్‌పీ చీఫ్. ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పార్టీని పవర్లోకి తెచ్చిన సాలిడ్ కాంబినేషన్. ఇప్పుడు భట్టి అండ్ రేవంత్ కాంబినేషన్‌లో ఆ సింక్రనైజేషన్ వెతికినా కనిపించదు. ఒకవేళ పార్టీకి పవరొస్తే కుర్చీ విషయంలో రేవంత్‌తో పోటీకి సై అంటున్నారు భట్టి. వీళ్లిద్దరికి తోడు… మిగతా సీనియర్లు కూడా సింహాసనమే తమ టార్గెట్ అంటున్నాయి. ఒక్క జెండా… పదహారు ఎజెండాలు… తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మొత్తంగా పదహారు చీలికలు. ఇప్పుడు కొత్తగా సీఎం ఎవరనే వింత పితలాటకం. తండ్రి పోస్టులో ఉన్న ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్‌కి మాత్రం బలగం సినిమా కనిపిస్తోంది. అయితే, ఈ సీఎం కూర్చి లొల్లి ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల్లో హాట్ హాట్ టాపిక్ గా మారింది.

ఫుల్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!