AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bikes: సెకండ్ హ్యాండ్ బైక్ కావాలా..? అత్యంత చవక ధరకే కొనుగోలు చేయొచ్చు.. మీరూ తీసుకోండి..

కొత్త బైక్ కొనుగోలు చేయలేని చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్ కొంటూ ఉంటారు. ఇటీవల మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే అనేక సెంటర్లు వచ్చేశాయి. అయితే పోలీస్ శాఖ వదిలేసిన వాహనాలను ఈ వేలం ద్వారా విక్రయిస్తోంది. వీటి వివరాల్లోకి వెళ్తే..

Bikes: సెకండ్ హ్యాండ్ బైక్ కావాలా..? అత్యంత చవక ధరకే కొనుగోలు చేయొచ్చు.. మీరూ తీసుకోండి..
Second Hand Bike
Venkatrao Lella
|

Updated on: Feb 10, 2026 | 7:23 PM

Share

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం తప్పనిసరి. కారు లేదా బైక్ లాంటివి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దూరపు ప్రాంతాలకు ట్రావెల్ చేయాలన్నా లేదా ఆఫీస్‌కు వెళ్లాలన్నా, వ్యాపార పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా సొంత వాహన కలిగి ఉండటం వల్ల త్వరగా గమ్యాస్థానికి చేరుకుంటాం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసుల్లో జనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు ఆలస్యమవుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలన్నా సొంత వాహనం కలిగి ఉండటం వల్ల హాయిగా వెళ్లొచ్చు. ఈ రోజుల్లో కారు లేదా బైక్ ఎక్కువమంది కలిగి ఉంటున్నారు. సొంత వాహనం కొనుగోలు చేసే స్తోమత లేనివారు సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేస్తున్నారు. అతి తక్కువ ధరల్లో ఇవి లభిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో దొరికే సెకండ్ హ్యాండ్ బైక్‌లకు మార్కెట్లో తెగ డిమాండ్ ఉంది.

తక్కువ ధరలో బెస్ట్ బైక్

ట్రాఫిక్ నిబంధనల్లో పట్టుబడిన వాహనాలు లేదా రోడ్డు పక్కన అలాగే వదిలేసిన వాహనాలను పోలీస్ శాఖ విక్రయిస్తూ ఉంటుంది. వీటిని అతి చవకైన ధరకే ప్రజలకు అందిస్తూ ఉంటుంది.  ఇందుకోసం వేలం పాటలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో మోయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణం, బౌరంపేట్‌లో వివిధ కంపెనీల మోడళ్ల బైక్‌లకు పోలీస్ శాఖ ఆన్‌లైన్ వేలం నిర్వహించనుంది.  304 వదిలివేసిన వాహనాలను ఈ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎంటీఓ – II ఎన్. వీరలింగం వెల్లడించారు. సైబరాబాద్‌ (మెట్రోపాలిటన్‌ ఏరియా) పోలీస్‌ యాక్ట్–2004 సెక్షన్‌ 6(2), 7తో పాటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్ సెక్షన్లు 39, 40, 41 ప్రకారం ఈ వాహనాలను వేలం వేయనున్నట్లు తెలిపారు.. వాహనాలపై యాజమాన్య హక్కు లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నవారు ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసి తమ వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.

పబ్లిక్ ఆన్‌లైన్ వేలం

నిర్దిష్ట గడువులోగా ఎవరూ దావా చేయని పక్షంలో పోలీస్ శాఖ యజమాని లేని వాహనాలను పబ్లిక్‌ ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయిస్తోంది. మోయినాబాద్‌ స్టేషన్‌లో ఉన్న వాహనాల వివరాలు ఎన్‌. వీరలింగం, ఎమ్‌టీఓ–II, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పర్యవేక్షణలో ఉంటాయి. పూర్తి వివరాల కోసం ప్రజలు సైబరాబాద్‌ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌‌ను సందర్శించవచ్చని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ వేలంలో తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లను పొందవచ్చు. దీంతో ఎవరైనా సెకండ్ హ్యాండ్ బైక్ కోస చూస్తుంటే ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Follow Us
జాగ్రత్త.. ఇది సైలెంట్ కిల్లర్.. అలాంటి మరణాల్లో తెలంగాణ నెం.1
జాగ్రత్త.. ఇది సైలెంట్ కిల్లర్.. అలాంటి మరణాల్లో తెలంగాణ నెం.1
ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
ఆ సినిమా చూడలేక ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా..
ఆ సినిమా చూడలేక ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా..
5 వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డు
5 వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డు
మాయమవుతున్న జానపద ఆచారం! కందికట్కూరులో కప్పతల్లి ఆట ఆడిన పిల్లలు
మాయమవుతున్న జానపద ఆచారం! కందికట్కూరులో కప్పతల్లి ఆట ఆడిన పిల్లలు
పీపీఎఫ్ ఖాతా ద్వారా ప్రతీ నెలా రూ.లక్ష పెన్షన్.. ఎలా అంటే..?
పీపీఎఫ్ ఖాతా ద్వారా ప్రతీ నెలా రూ.లక్ష పెన్షన్.. ఎలా అంటే..?
నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే
హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..?
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..?
వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ
వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ