Cyberabad CP: నకిలీ వెబ్‌సైట్లతో ఘరానా మోసం.. చెక్ పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. తస్మాత్ జాగ్రత్త అంటూ..

Cyberabad Police: నకిలీ వెబ్‌సైట్ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.

Cyberabad CP: నకిలీ వెబ్‌సైట్లతో ఘరానా మోసం.. చెక్ పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. తస్మాత్ జాగ్రత్త అంటూ..
Cp Sajjnar
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 23, 2021 | 2:19 PM

Cyberabad Police: నకిలీ వెబ్‌సైట్ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. తక్కవ ధరకే అంటూ ప్రజలను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్న మాయగాళ్ల గుట్టు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం నాడు మీడియా ఎదుట వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేక్ వెబ్‌సైట్ ద్వారా ఫర్నీచర్, వంటింటి సామాగ్రి తక్కువ ధరలకే అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం నడిపించారు. మొత్తం సైబరాబాద్‌లో 9 కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇలా ఫేక్ వెబ్‌సైట్‌తో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. Www.bigbasket.com, Care@Zopnow.in పేరుతో అమాయకుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు.

ఈ కేసులో సైబర్ చీటర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రిషబ్ ఉపాధ్యాయను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రిషబ్ ఉపాధ్యాయ నుంచి రూ. 40 లక్షల నగదు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంక్ పాస్ బుక్స్, 2 ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. కాగా, ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సీపీ సజ్జనార్ సూచించారు. తక్కువ ధరకు వస్తువులు ఇస్తామంటే ఎవరూ నమ్మొద్దని హితవుచెప్పారు. మందస్తుగా నగదు ఎవరికీ బదిలీ చేయొద్దని సూచించారు. అలాంటి అనుమానాస్పద వెబ్‌సైట్స్, మోసాలకు సంబంధించి ఎవరికైనా సమాచారం లభిస్తే వెంటనే క్రైమ్ పోలీసుల నెంబర్ 94906 17310, వాట్సప్ నెంబర్ 94906 1744 కి పిర్యాదు చేయండని ప్రజలకు సీపీ సజ్జనార్ సూచించారు.

Also read:

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..

Headset for pains: నొప్పులను తగ్గించే హెడ్‌సెట్‌ వస్తోంది.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

IND vs SL 3rd ODI Live: మూడో వన్డేకు రంగం సిద్దం.. వైట్‌వాషే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న టీమిండియా..