Shamshabad Airport: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. కాళ్లకు గాయాలైనట్లు నమ్మించి.. కట్టు కట్టుకుని మరీ..
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి...
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడం, పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అధికారులు సరకును స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం 957 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.46 లక్షల 53 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయితే.. బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కాళ్లకు కట్టు కట్టుకున్నట్టుగా బంగారం దాచుకుని రావడం కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ స్కానర్ లో అతని బాగోతం బయటపడటం, అనుమానాస్పదంగా వ్వహరించడంతో అధికారులు కూపీ లాగగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కాగా.. గతంలోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. రెండు నెలల క్రితం భారీగా బంగారం స్మగ్లింగ్ చేసుకున్నారు. అంతే కాకుండా అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. ఎయిర్ పోర్ట్ అధికారులు, సిబ్బందికి వారి కదలికలు అనుమానాస్పతంగా కనిపించాయి. వారిని చెక్ చేయగా ఇల్లీగల్ గోల్డ్ బయటపడింది. వారి వద్ద దాదాపుగా 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..