GHMC: హైదరాబాద్‌లోని దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు.. ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ అందించిన ఫుడ్ కంట్రోలర్

నగరంలోని ఆలయాల్లో భక్తులకు శుభ్రమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో ప్రసాదల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని లైసెన్సులు ఇస్తున్నట్లు

GHMC: హైదరాబాద్‌లోని దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు.. ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ అందించిన  ఫుడ్   కంట్రోలర్
Ghmc Assistant Food Controller Balaji Raju
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 15, 2022 | 9:26 PM

హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి గురువారం ఆయన సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు మాట్లాడుతూ.. నగరంలోని ఆలయాల్లో భక్తులకు శుభ్రమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో ప్రసాదల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని లైసెన్సులు ఇస్తున్నట్లు వివరించారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏఎఫ్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రవేశపెట్టిన భోగ్ (బ్లిస్ ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్ ల జారీ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే నగరంలో సుమారు 8 దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇటీవల బల్కంపేట శ్రీ పోచమ్మ దేవాలయానికి అందజేశామని, ఈరోజు శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి అందజేశామని అన్నారు.

ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్ఎంసీ జారీ చేస్తున్న ఫుడ్ లైసెన్స్‌ను గురువారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో, సహాయ కమిషనర్ జి. మనోహర్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, మౌలిక, లక్ష్మీకాంత్, ఆలయ సూపరింటెడెంట్ జి సాయిరాం, స్టోర్ ఇంచార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం