- Telugu News India News Unique house in maharajguda village 4 rooms fall in maharashtra while 4 others in telangana Telugu News
unique house: ఇదో విచిత్రమైన ఇల్లు.. వంటగది తెలంగాణలో ఉంటే.. బెడ్ రూమ్ మహారాష్ట్రలో..
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో ఒక భాగం మహారాష్ట్రలో, మరొక భాగం తెలంగాణలో ఉంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ, ఇది నిజమేనండోయ్..! పైగా, దీని వల్ల ఇంటి యజమాని ఇరు రాష్ట్రాలకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
Updated on: Dec 16, 2022 | 12:54 PM

చంద్రపూర్ జిల్లా మహారాజ్‌గూడ గ్రామంలో ఉన్న ఈ ఇల్లు రెండు రాష్ట్రాల మధ్య అంటే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉంది. దీని 4 గదులు మహారాష్ట్రలో, 4 గదులు తెలంగాణలో ఉన్నాయి.

అయితే దీని వల్ల ఇరు రాష్ట్రాలకు పన్నులు కడుతున్నాడు ఇంటి యజమాని ఉత్తమ్ పవార్.. దీంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అంతేకాదు.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పొందుతున్నామని చెబుతున్నారు.

తన ఇంట్లో 13 మంది సభ్యులు నివసిస్తున్నారని పవార్ చెప్పారు. వారికి తెలంగాణలో వంటగది, మహారాష్ట్రలో హాల్ ఉన్నాయి. కాగా, తన సోదరుడి గది తెలంగాణలో ఉంది.

1969లో హద్దుల సర్వే జరిగినప్పుడు తన ఇంట్లో సగం మహారాష్ట్రలో ఉందని, మిగిలిన సగం తెలంగాణలో ఉందని భూ యజమాని చెప్పారు.