Gold Prices: బంగారం ధరలు మళ్లీ ఢమాల్.. సోమవారం మారిపోయిన రేట్లు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..?
డాలర్ బలపడటం, అంతర్జాతీయ పరిణామాల క్రమంలో బంగారం ధరలు గత కొంతకాలంగా తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలు చేసేవారికి ఇది మంచి న్యూస్‌గా చెప్పవచ్చు. ధరలు తగ్గుతుండటంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. గత కొంతాకలంగా ధరలు పతనమవుతూ వస్తోన్నాయి.

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. పసిడి ధరలు గత కొద్ది రోజులుగా దిగొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మరోసారి గోల్డ్ రేట్లు సోమవారం పడిపోయాయి. వారం ప్రారంభంలోనే బంగారం ధరలు దిగజారిపోయాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే వార్తగా చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు ఇదే బాట పడుతున్నాయి. రోజురోజుకి పతనమవుతూ వస్తోన్నాయి. దీంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పడిపోతాయనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అదే నిజమని అనిపిస్తోంది. సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఇవాల్టీ గోల్డ్ రేట్లు ఇవే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,920 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,50,930 వద్ద స్థిరపడ్డాయి. అటు 22 క్యారెట్ల ధర రూ.1,38,340 వద్ద ట్రేడవుతుండగా.. ఆదివారం రూ.1,38,350 వద్ద స్ధిరపడ్డాయి. విజయవాడ., విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,720 వద్ద ట్రేడవుతుండగా.. ఆదివారం రూ.1,52,730 వద్ద స్ధిరపడ్డాయి. ఇక 22 క్యారెట్ల ధర నిన్న రూ.1.40 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.1,39,990కి పడిపోయాయి.
-ఇక బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,50,920 వద్ద కొనసాగుతుండగా.. ఆదివారం రూ.1,50,930 వద్ద ఉన్నాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,38,340 వద్ద ప్రస్తుతం ఉండగా.. ఆదివారం రూ.1,38,350 వద్ద కొనసాగాయి.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,220 వద్ద ఉండగా.. నిన్న రూ.1,51,230గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,490 వద్ద ఇప్పుడు ఉండగా.. నిన్న రూ.1,38,500 వద్ద ఉంది.
వెండి ధరలు ఇలా..
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర ఆదివారం రూ.2.65 లక్షలుగా ఉంది. సోమవారం రూ.2,64,900కి పడిపోయింది.
-హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,69,900గా ఉండగా.. ఆదివారం రూ.2.70 లక్షలుగా ఉంది.
-చెన్నైలో కేజీ సిల్వర్ ధర ప్రస్తుతం రూ.2,69,900 వద్ద ట్రేడవుతుండగా.. ఆదివారం రూ.2.70 లక్షలుగా ఉంది.
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,64,900గా ఉండగా.. నిన్న రూ.2.65 లక్షల వద్ద ఉంది.
