AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2026 LIVE: భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి.. 11వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపు

5 State Assembly Election Results 2026 LIVE Counting and Updates in Telugu: దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేక ప్రజల నాడి మరేదైనా ఉందా? అనేది కాసేపట్లో తేలనుంది.

Assembly Election Results 2026 LIVE: భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి.. 11వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపు
5 State Assembly Election Results 2026 Live
Krishna S
| Edited By: |

Updated on: May 04, 2026 | 10:24 PM

Share

మరికాసేపట్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్‌ తెరపైకి రానుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను ఆ తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే కౌంటింగ్‌ కోసం 62 సెంటర్లను ఏర్పాటు చేశారు. పవర్‌ను చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 118. ఈసారి తమిళనాట రికార్డు స్థాయిలో 85శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. భారీ ఓటింగ్‌ ఎవరికి ప్లస్‌ ? ఎవరికి మైనస్‌? అనే చర్చ జరుగుతోంది. తమిళనాడ DMK మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? సూపర్‌ స్టార్‌ విజయ్‌ TVK పార్టీ పవర్‌ను పుల్‌ చేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

ఇక పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. 93 శాతం ఓటింగ్‌ నమోదయింది. అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 148. కౌంటింగ్‌ కోసం 77 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈసారి మళ్లీ టీఎంసీనే పగ్గాలు చేజిక్కించుకుంటుందా? లేదంటే బీజేపీ పాగా వేయబోతుందా?ఈసారి బెంగాల్‌ టైగర్‌ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బీజేపీకి ఎడ్జ్‌నిచ్చాయి. ఐతే పక్కా లెక్క ఏంటో మరికాసేపట్లో తేలనుంది.

ఇక కేరళలో కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపుకు 140 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 71. ఈసారి 78 శాతానికి పైగా ఓటింగ్‌ జరిగింది. పినరయి విజయన్‌ మళ్లీ సర్కార్‌ ఏర్పాటు చేస్తారా? UDF పవర్‌లోకి వస్తుందా? కమలానికి ఈసారి కలిసివస్తుందా?. కేరళలో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఈసారి 85శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపుకు 40 కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 64. మళ్లీ బీజేపీ సర్కార్‌ వస్తుందని సర్వే సంకేతాలిచ్చాయి. సర్వే అంచనాలే నిజమవుతాయా? లేదంటే లెక్క మారుతుందా? అనేది మరికాసేపట్లో తేలనుంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ సారి 90 శాతం పోలింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపు 6 కేంద్రాల్లో జరుగుతుంది. మళ్లీ తామే పవర్‌లోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 May 2026 09:36 PM (IST)

    బెంగాల్‌: భవానీపూర్‌లో మమతాబెనర్జీ ఓటమి

    • 15,114 ఓట్ల తేడాతో మమతాబెనర్జీ ఓటమి
    • మమతాబెనర్జీపై సువేందు అధికారి గెలుపు
  • 04 May 2026 08:58 PM (IST)

    సీఈసీపై మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

    • సీఈసీ ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదు -మమతా
    • మోదీ, అమిత్ షా కనుసన్నల్లో పనిచేసింది.. కేంద్ర ఎన్నికల సంఘం కాదది.. బీజేపీ కమిషన్‌- మమతా
    • 100కు పైగా సెంటర్లలో అక్రమాలు జరిగాయి.. నా దగ్గర కార్డ్‌ ఉన్నా లోపలికి అనుమతించలేదు -మమతా
    • బీజేపీ విజయం అప్రజాస్వామికం, అనైతికం -మమతా బెనర్జీ
  • 04 May 2026 07:49 PM (IST)

    ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ రియాక్షన్

    • కార్యకర్తల సుదీర్ఘ కల, శ్రమ ఫలించాయి: ప్రధాని మోదీ
    • దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు: మోదీ
    • నితిన్‌ నబీన్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన తొలి ఎన్నిక ఇది: మోదీ
    • బెంగాల్‌లోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ ప్రవేశించింది: మోదీ
    • బెంగాల్‌ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించారు: ప్రధాని మోడీ
    • పుదుచ్చేరి ప్రజలకు మరోసారి NDAపై నమ్మకం ఉంచారు: మోదీ
    • పుదుచ్చేరి అభివృద్దికి కట్టుబడి ఉన్నాం: మోదీ
    • బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: మోదీ
    • ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగం గెలిచింది: మోదీ
    • ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఈసీకి ధన్యవాదాలు: మోదీ
    • దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది: మోదీ
    • తమ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలో ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు: మోదీ
    • బెంగాల్ ప్రజలు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీని గెలిపించారు: మోదీ
  • 04 May 2026 06:43 PM (IST)

    టీవీకే విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

    • అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీవీకేకు అభినందనలు: మోదీ
    • తమిళనాడు పురోగతిని, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో.. కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుంది: ప్రధాని మోదీ
  • 04 May 2026 06:35 PM (IST)

    బెంగాల్‌లో విజయంపై ప్రధాని మోదీ స్పందన

    • బెంగాల్‌లో కమలం వికసించింది- ప్రధాని మోదీ
    • బెంగాల్‌ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు: మోదీ
    • ఇది బెంగాల్‌ ప్రజల సాధించిన విజయం: మోదీ
    • బీజేపీని గెలిపించిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు: ప్రధాని మోడీ
  • 04 May 2026 06:33 PM (IST)

    విజయ్‌కు హీరో మహేష్‌ బాబు అభినందనలు

    • అద్భుత విజయం సాధించిన విజయ్‌కు శుభాకాంక్షలు: మహేశ్‌బాబు
    • ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనం: మహేశ్
    • తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుంది: మహేశ్ బాబు
  • 04 May 2026 06:31 PM (IST)

    తమిళనాడు ఫలితాలపై హీరో విశాల్ రియాక్షన్

    • ప్రజలు మార్పు కోరుకుంటే ఎవ్వరూ ఆపలేరు: విశాల్‌
    • మొదటి ఎన్నికల్లోనే విజయ్‌ అద్భుతమైన విజయం సాధించారు: విశాల్
    • తమిళనాడులో ఎంజీఆర్‌నాటి కాలం పునరావృతమైంది: విశాల్
    • ప్రజలు మార్పు కోరుకుంటే ఎవ్వరూ ఆపలేరు, ప్రస్తుతం పరిస్థితులే అందుకు నిదర్శనం
    • ఎన్నికల్లో విజయం సాధించినందు టీవీకేకు హృదయపూర్వక శుభాకాంక్షలు: విశాల్
  • 04 May 2026 06:17 PM (IST)

    విజయ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన త్రిష

    విజయం తర్వాత విజయ్ ఇంటికి వచ్చిన త్రిష

    ఎన్నికల్లో గెలుపుపై విజయ్‌కు త్రిష అభినందనలు

  • 04 May 2026 05:22 PM (IST)

    పశ్చిమబెంగాల్‌ బీజేపీ కైవసం

    • మ్యాజిక్‌ ఫిగర్‌ 147 దాటిన బీజేపీ
    • మూడు వరుస గెలుపుల తర్వాత మమత పార్టీ ఓటమి
    • బెంగాల్‌లో ఖాతా తెరవని కాంగ్రెస్‌
    • వరుసగా రెండోసారి ఖాతా తెరవని కాంగ్రెస్‌
    • భవానీపూర్‌ కౌంటింగ్‌ సెంటర్‌లో ఉద్రిక్తత
    • 12 రౌండ్ల కౌంటింగ్‌ తర్వాత..
    • తనను కొట్టి బయటికి గెంటేశారన్న TMC ఏజెంట్‌
    • కౌంటింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లిన మమతాబెనర్జీ
  • 04 May 2026 05:19 PM (IST)

    తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విజయం

    • తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విజయం
    • ఎడప్పాడిలో 90 వేలకు పైగా ఓట్లతో గెలుపు
  • 04 May 2026 05:17 PM (IST)

    అస్సాంలో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ

    • 100కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ముందంజ
    • అస్సాంలో కాంగ్రెస్ కీలక నేత గౌరవ్ గగోయ్ ఓటమి
    • జోర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గగోయ్
    • గగోయ్‌పై బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గెలుపు
  • 04 May 2026 05:17 PM (IST)

    బెంగాల్‌లో బీజేపీ విజయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్

    • డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌గా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయం
    • గత పదేళ్లలో బెంగాల్‌లో దీదీ ప్రభుత్వం చేయని అరాచకం లేదు: కిషన్ రెడ్డి
    • టీఎంసీ అరాచకాలు, గుండాగిరితో జనం విసిగిపోయారు: కిషన్ రెడ్డి
    • దీదీ సర్కారు ఇల్లీగల్‌ కోల్ మైనింగ్‌ చేసి కోట్లు వెనకేసుకుంది: కిషన్ రెడ్డి
    • కోల్ బెల్ట్‌తో బీజేపీ గెలుపు టీఎంసీకి చెంపపెట్టు: కిషన్‌ రెడ్డి
  • 04 May 2026 04:59 PM (IST)

    పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపు

    • తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం
    • పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపు
    • పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్‌లో విజయ్ గెలుపు
  • 04 May 2026 04:57 PM (IST)

    తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. పవన్ కల్యాణ్‌ ఏమన్నారంటే?

    • ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారు: పవన్
    • బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం: పవన్
    • ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపిస్తోంది: పవన్
    • పాలన నచ్చితే గెలిపాస్తారు.. నచ్చకపోతే ఓడిస్తారు: పవన్
    • అస్సాంలో విజయాన్ని దక్కించుకున్న హిమంత్ బిశ్వశర్మకు అభినందనలు: పవన్
    • పుదుచ్చేరిలో NDA విజయాన్ని మళ్ళీ అందించిన రంగసామికి అభినందనలు: పవన్
    • తమిళనాడులో విజయంవైపు దూసుకెళ్తున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు అభినందనలు
    • పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్‌ను అభినందిస్తున్నా
    • కేరళలో గెలిచిన యూ.డి.ఎఫ్. నాయకత్వానికి అభినందనలు: పవన్
  • 04 May 2026 04:47 PM (IST)

    విజయ్‌కు హరో విక్రిమ్ అభినందనలు

    • నువ్వు చరిత్ర సృష్టించావు విజయ్- విక్రమ్‌
    • అభినందనలు ఫ్రెండ్ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్
  • 04 May 2026 04:47 PM (IST)

    తమిళనాడులో టీవీకే జోరు

    • విజిల్‌ వేసి అభినందనలు చెప్పిన జీవా
    • సోషల్‌ మీడియాలో విజిల్ వేస్తున్న వీడియో పోస్ట్
  • 04 May 2026 04:44 PM (IST)

    పుదుచ్చేరిలో మిళ్లే NDAకే పట్టం

    • NDA కూటమి 20 స్థానాల్లో ముందంజ
    • కాంగ్రెస్ కూటమి కేవలం 5 సీట్లకే పరిమితం
    • స్వతంత్రులు 3, TVK 2 సీట్లలో ముందంజ
    • యానాంలో మల్లాడి కృష్ణారావు విజయం
    • గొల్లపల్లి అశోక్‌పై 4 వేల 568 ఓట్ల తేడాతో మల్లాడి గెలుపు
  • 04 May 2026 04:14 PM (IST)

    కేరళంలో విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

    • కాంగ్రెస్ నేతలు, UDF కార్యకర్తలకు అభినందనలు
    • కష్టపడి సాధించిన చారిత్రాత్మక విజయం-రేవంత్‌
    • రాహుల్, ఖర్గే, ప్రియాంకకు అభినందనలు-రేవంత్‌
    • నాయకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైంది
    • ప్రచారంలో నాపై అభిమానం చూపించిన..
    • కేరళం ప్రజలకు కృతజ్ఞతలు-సీఎం రేవంత్‌
  • 04 May 2026 04:14 PM (IST)

    కేరళలో విజయంపై కేసీ వేణుగోపాల్ రియాక్షన్

    • త్వరలో కేరళం ప్రజల ముందు కార్యాచరణ ఉంచుతాం-కేసీ వేణుగోపాల్‌
    • MLAల అభిప్రాయాలను పరిశీలకులు తెలుసుకుంటారు:కేసీ వేణుగోపాల్‌
    • మా మిత్రపక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతాం: కేసీ వేణుగోపాల్‌
    • హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది-కేసీ వేణుగోపాల్
    • వామపక్షాల దుస్థితికి వారే పూర్తిగా బాధ్యులు:కేసీ వేణుగోపాల్‌
  • 04 May 2026 04:09 PM (IST)

    తమిళనాడులో టీవీకే అధికారం ఏర్పాటు సాధ్యమేనా?

    • టీవీకే పూర్తిస్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యం అంటున్న విశ్లేషకులు
    • తమిళనాడులో హంగ్‌కే అవకాశం ఉందని టాక్
    • టీవీకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీతో 11 సీట్లు
    • మరో 12 చోట్లు కేవలం 2 వేల లోపు మెజార్టీతో టీవీ అభ్యర్థులు
    • 8 స్థానాల్లో కేవలం 500 లోపు మెజార్టీతో కొనసాగుతున్న అభ్యర్థులు
    • హంగ్ వస్తే కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలతో టీవీకే కలిసి వెళ్లే ఛాన్స్
  • 04 May 2026 04:03 PM (IST)

    బెంగాల్‌: భవానీపూర్‌ కౌంటింగ్‌ సెంటర్‌లో ఉద్రిక్తత

    • కౌంటింగ్‌ కేంద్రానికి మమతాబెనర్జీ
    • తమ ఏజెంట్‌పై దాడి చేశారని మమతాబెనర్జీ ఆరోపణ
    • కౌంటింగ్‌ కేంద్రంలో అవతవకలకు పాల్పడుతున్నారని మండిపాటు
  • 04 May 2026 03:56 PM (IST)

    తండ్రి ఓటమి.. అధిక్యంలోకి కుమారుడు

    • చెపాక్ నియోజకవర్గంలో ఆధిక్యంలోకి వచ్చిన ఉదయనిధి
    • 17 రౌండ్లలో 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు వివరాలు బహిర్గతం
    • 11 రౌండ్లలో సమీప ప్రత్యర్థి TVK అభ్యర్థి డి. సెల్వంపై  4319 ఓట్ల ఆధిక్యం
  • 04 May 2026 03:54 PM (IST)

    టీవీకే అభ్యర్థి చేతిలో సీఎం స్టాలిన్ ఓటమి!

    • కొలత్తూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎం.కె. స్టాలిన్
    • స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు ముందంజ
    • స్టాలిన్‌పై 7544 ఓట్ల మెజార్టీతో గెలిచిన వి. ఎస్‌ బాబు
    • స్టాలిన్‌కు 57,170 ఓట్లు
    • వీఎస్‌ బాబుకు 64714 ఓట్లు,
  • 04 May 2026 03:46 PM (IST)

    కేరళలో మెజార్టీ సాధించిన యూడీఎఫ్‌ కూటమి

    • 100 స్థానాల్లో యూడీఎఫ్‌ అభ్యర్థుల లీడ్‌
    • 37స్థానాలకు పరిమితమైన అధికార ఎల్డీఎఫ్‌
    • 3స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ముందంజ
    • ధర్మదాంలో గెలుపుదిశగా సీఎం విజయన్‌
    • యూడీఎఫ్‌ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
    • సీఎం రేసులో వీడీ సతీషన్‌, కేసీ వేణుగోపాల్‌, రమేష్‌ చెన్నితల, శశిథరూర్‌ కేసీ వేణుగోపాల్‌
    • ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌ పేరిట కేరళలో పోస్టర్లు
    • హైకమాండ్‌ ఆశీసులు ఎవరికనే ఉత్కంఠ!
  • 04 May 2026 03:30 PM (IST)

    విజయ్‌కు వైపీసీ అధినేత జగన్ అభినందనలు

    • నా ప్రియ సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు: జగన్
    • తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించడం నిజంగా అద్భుతం: జగన్
    • నీవు చేపట్టిన ఈ నూతన సేవాలో నీకు విజయం చేకూరాలి: జగన్
    • భగవంతుని దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉండాలి: జగన్.
    • మమతా బెనర్జీ పట్ల నా సానుభూతిని తెలియజేస్తున్నాను: జగన్
    • ఎన్నికల్లో విజయం దిశగా వెళ్తున్న బీజేపీ, ఇతరులకు అభినందనలు: జగన్
  • 04 May 2026 03:11 PM (IST)

    నాలుగు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకున్నారు- ఎంపీ లక్ష్మణ్

    • ఏ ఎన్నికలు జరిగినా BJPదే విజయం -ఎంపీ లక్ష్మణ్‌
    • 4 రాష్ట్రాల్లో ప్రభుత్వ మార్పు జరిగింది
    • డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి -ఎంపీ లక్ష్మణ్‌
    • వారసత్వ పార్టీలకు చరమగీతం పాడారు
    • అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది
    • వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం
    • తెలంగాణలో BJPని గెలిపించి మోదీకి కానుకగా ఇస్తాం -ఎంపీ లక్ష్మణ్‌
  • 04 May 2026 03:02 PM (IST)

    విజయం దిశగా విజయ్.. అందరిదృష్టి త్రిషపైనే..!

    • ట్విట్టర్‌లో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి త్రిష
    • త్రిషతోపాటు ట్రెండింగ్‌లో జననాయగన్‌ హ్యాష్‌ట్యాగ్‌
    • విజయ్‌-త్రిషను టార్గెట్‌ చేస్తూ సాగిన DMK, BJP ఎన్నికల ప్రచారం
    • విజయ్‌ పార్టీకి పట్టం కట్టిన తమిళనాడు ఓటర్లు
    • త్రిష ఇంటినుంచి విజయ్‌ బయటకు రావాలంటూ..
    • ఎన్నికల ప్రచారంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ కామెంట్స్‌
    • అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్‌ ఇంటికొచ్చిన త్రిష
    • ఇవాళే ఎన్నికల ఫలితాలు, ఇవాళే కాకతాళీయంగా త్రిష పుట్టినరోజు
  • 04 May 2026 02:59 PM (IST)

    యానాం ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు విజయం

    • యానాం ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు విజయం
    • గొల్లపల్లిపై 4,568 ఓట్ల మెజారిటీతో మల్లాడి గెలుపు
    • ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు
  • 04 May 2026 02:36 PM (IST)

    తమిళనాడులో డీఎంకే కూటమికి తొలి విజయం

    • మేలురు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.విశ్వనాథన్‌ విజయం సాధించారు.
    • ప్రస్తుతం 63 స్థానాల్లో కొనసాగుతున్న డీఎంకే కూటమి
    • 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఏఐడీఎంకే
    • 111 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉన్న టీవీకే
  • 04 May 2026 02:05 PM (IST)

     తండ్రీకొడుకులకు షాక్‌ ఇచ్చిన తమిళ ఓటర్‌

    •  తండ్రీకొడుకులకు షాక్‌ ఇచ్చిన తమిళ ఓటర్‌
    •  తమిళనాడు CM స్టాలిన్‌కి భంగపాటు తప్పదా?
    •  కొళత్తూరులో 8019 ఓట్ల వెనుకంజలో స్టాలిన్‌
    •  22 రౌండ్లకు ఇప్పటికే 11 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి
    •  మొదటిరౌండ్‌ నుంచి TVK అభ్యర్థి బాబుకు ఆధిక్యం
    •  చెన్నై సిటీలోని చెపాక్‌లో ఎదురీదుతోన్న ఉదయనిధి స్టాలిన్‌
    •  మొత్తం 17 రౌండ్లలో ఇప్పటికి 8 రౌండ్లు పూర్తి
    •  కేవలం 1048 ఓట్ల ఆధిక్యంలో ఉదయనిధి
  • 04 May 2026 01:37 PM (IST)

    సీఎంకు నా శుభాకాంక్షలు

    • తన కొడుకు విజయ్ విజయంపై తండ్రి చంద్రశేఖర్ హర్షం
    •  సీఎంకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను -విజయ్ తండ్రి
    •  గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదు -తండ్రి చంద్రశేఖర్
    •  అందుకే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోలేదు
    •  ఇది చారిత్రిక విజయం -విజయ్ తండ్రి చంద్రశేఖర్
    •  తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చింది – చంద్రశేఖర్
    •  సమాజానికి ఏదైన చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటి నుంచో ఉంది
    •  విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారు – చంద్రశేఖర్
    •  మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారు – చంద్రశేఖర్
    •  విజయ్‌ని అందరు అన్నా అని పిలుస్తారు – చంద్రశేఖర్
  • 04 May 2026 01:15 PM (IST)

    ఆ సీటు త్రిషదే..!

    • పోటీచేసిన రెండుచోట్లా విజయం దిశగా విజయ్‌
    • తిరుచ్చి ఈస్ట్‌, పెరంబూర్‌లో విజయ్‌ దేన్ని వదులుకుంటారు?
    • విజయ్‌ రాజీనామా చేసే స్థానంలో పోటీచేసేది ఎవరు?
    • విజయ్‌ తండ్రి చంద్రశేఖరన్‌ పోటీచేస్తారా? త్రిష బరిలో ఉంటారా?
    • త్రిష పోటీచేస్తారంటూ ఇప్పటికే తమిళనాడులో ప్రచారం
    • గతంలో టికెట్ల కోసం త్రిష ఇంటికి క్యూ కట్టిన TVK నేతలు
    • TVKలో త్రిషనే పవర్‌ సెంటర్‌ అవుతారంటూ ఊహాగానాలు
  • 04 May 2026 01:03 PM (IST)

    విజయ్ నివాసానికి త్రిష

    • దళపతి విజయ్ నివాసానికి త్రిష
    • ఎన్నికల్లో విజయంపై విజయ్‌కు కంగ్రాట్స్ తెలిపిన త్రిష
    • ఈ ఉదయమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష
  • 04 May 2026 12:57 PM (IST)

    మమత కీలక వ్యాఖ్యలు

    • బెంగాల్‌ ఫలితాలపై మమత కీలక వ్యాఖ్యలు
    • తుది ఫలితాలు మారుతాయ్‌
    • ఇప్పటివరకు మూడు రౌండ్ల లెక్కింపే జరిగింది
    • తుది ఫలితం మావైపే ఉంటుంది- మమత
    • SIR పేరుతో బీజేపీ ఓట్లు చోరీ చేసింది- మమత
    • కౌంటింగ్‌ కేంద్రాల నుంచి టీఎంసీ కార్యకర్తలు బయటకు రావొద్దు
    • గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన టీఎంసీ అధినేత్రి
  • 04 May 2026 12:35 PM (IST)

    బీజేపీ గెలుపుపై బండి

    • దేశంలో కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదు – కేంద్రమంత్రి బండి సంజయ్
    • కాంగ్రెస్ ముక్త భారత్ సాకారం అవుతోంది – బండి సంజయ్
    • మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును..
    • వ్యతిరేకించిన పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం – బండి సంజయ్
    • రాహుల్‌ను రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ వాళ్లే గుర్తించడం లేదు
    • దేశంలో ఇండి కూటమి కొట్టుకుపోతోంది – బండి సంజయ్
  • 04 May 2026 12:18 PM (IST)

    5వ సారి సీఎంగా రంగస్వామి..?

    • పుదుచ్చేరి ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రధాన వ్యక్తి ఎన్ రంగస్వామి.
    • ప్రస్తుతం ఆయన సిట్టింగ్ సీఎంగా ఉన్నారు.
    • నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA కూటమికి నాయకత్వం వహిస్తున్నారు.
    • ఇప్పటికే 4సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం రంగస్వామికి ఉంది.
    • 5వ సారి సీఎం పదవిని చేపట్టేందుకు పోటీ పడుతున్నారు.
    • తట్టంచావడి, మంగళం నియోజకవర్గాల్లో రంగస్వామి పోటీ చేశారు.
  • 04 May 2026 12:07 PM (IST)

    డీఎంకే ఓటమికి కారణాలు

    తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమికి కారణాలు ఇవే.. 

    • పొత్తులో ఉన్నా.. కాంగ్రెస్‌తో వైరం
    • చివరి నిమిషం వరకు సీట్లపై రాని క్లారిటీ
    • కాంగ్రెస్‌ నియోజకవర్గాల్లో క్రాస్‌ ఓటింగ్‌
    • స్టాలిన్‌, రాహుల్‌ కలిసి ప్రచారం చేయకపోవడం
    • విజయ్‌ను ఇబ్బంది పెట్టారన్న ప్రచారం
    • విజయ్‌పై కేసులు పెట్టించారన్న కోపం
    • ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు
    • ఫ్యామిలీ పాలిటిక్స్‌
    •  ఆకట్టుకోని మేనిఫెస్టో
  • 04 May 2026 11:56 AM (IST)

    పుదుచ్చేరిలో వార్ వన్ సైడ్

    • పుదుచ్చేరిలో వార్ వన్ సైడ్
    • భారీ ఆధిక్యంలో బీజేపీ, NR కాంగ్రెస్ కూటమి
    • 30 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లలో ఆధిక్యంలో బీజేపీ కూటమి
    • కాంగ్రెస్ ఏడు సీట్లలోనే లీడ్
    • మరో మూడు స్థానాల్లో స్వతంత్రులు లీడ్‌
  • 04 May 2026 11:40 AM (IST)

    ఆధిక్యంలో విజయ్ డ్రైవర్ కొడుకు

    • విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ ముందంజ
    • విరుగంబాకం నియోజకవర్గంలో విజయ్ డ్రైవర్ కుమారుడు లీడ్
    • రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 2వేల 303 ఓట్ల లీడ్
  • 04 May 2026 11:23 AM (IST)

    Thalapathy Vijay: విజయ్‌కు ప్లస్‌ పాయింట్స్‌

    తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌కు ప్లస్‌ పాయింట్స్‌

    •  స్టార్‌డమ్‌
    • యువతలో మంచి ఇమేజ్‌
    •  ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం
    • ఉత్సాహంగా, వినూత్నంగా ప్రచారం
    • ఆకట్టుకునేలా ప్రసంగాలు
    • వివాదాలు, కేసులతో ప్రజల్లో సానుభూతి
    •  టీవీకే పార్టీ గుర్తు (విజిల్‌)
    • ఒంటరిగా పోటీ
    • మేనిఫెస్టో
  • 04 May 2026 11:14 AM (IST)

    బెంగాల్‌లో కమలవికాసం

    • బెంగాల్‌లో కమలవికాసం
    • మెజార్టీ మార్క్‌ దాటేసిన బీజేపీ
    • 170కి పైగా స్థానాల్లో బీజేపీ లీడ్‌, 114 స్థానాల్లో టీఎంసీ ముందంజ
    • భవానీపూర్‌లో ఎదురీదుతున్న మమత
    • బెంగాల్‌లో పనిచేసిన మోదీ, షా వ్యూహం
    • టీఎంసీని దెబ్బతీసిన శాంతిభత్రల అంశం
    •  బెంగాల్‌ ఎన్నికల్లో కీలకంగా SIR అంశం
    •  బెంగాల్‌లో 90లక్షల ఓట్లు తొలిగించిన EC
    • హిందుత్వ ఎజెండాను బలంగా అమలు చేసిన బీజేపీ
    • చొరబాటు అంశంపై ప్రముఖంగా మోదీ ప్రచారం
  • 04 May 2026 11:03 AM (IST)

    కేరళ సీఎం రేసులో కేసీ

    • కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, సతీషన్, రమేష్ చెన్నితల
    • కేసీని సీఎం చేయాలని పట్టుబడుతున్న ఆయన అనుచరులు
    • సతీషన్‌కు ముస్లిం లీగ్ సపోర్ట్.. ప్రస్తతం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు..
  • 04 May 2026 10:54 AM (IST)

    డీఎంకే కార్యకర్తల కన్నీళ్లు..

    • డీఎంకే పార్టీ ఊహించని షాక్‌ ఇచ్చిన తమిళనాడు ఓటరు
    • కార్యకర్తలను తీవ్ర నిరాశపరిచిన ఫలితాలు
    • విజయోత్సవాలను రద్దు చేసుకున్న డీఎంకే
    • పార్టీ ఆఫీస్‌ దగ్గర‌ వేసిన టెంట్లు తొలగింపు
    • ఫలితాల తర్వాత కన్నీరు పెట్టుకున్న కొందరు కార్యకర్తలు
  • 04 May 2026 10:45 AM (IST)

    అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఉత్సాహం

    • తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఉత్సాహం
    •  రెండో స్థానాల్లో కొనసాగుతున్న అన్నాడీఎంకే
    •  ఫలితాలతో సంబరాలు చేసుకుంటున్న పార్టీ కార్యకర్తలు
  • 04 May 2026 10:34 AM (IST)

    ప్రధాన రాష్ట్రాల్లో మార్పు కోరుకున్న ప్రజలు

    • 3 ప్రధాన రాష్ట్రాల్లో మార్పును కోరుకున్న ప్రజలు
    • తమిళనాడు, బెంగాల్‌, కేరళంలో మారుతున్న అధికార పగ్గాలు
    • తమిళనాడులో హంగ్‌, ఆధిక్యంలో విజయ్‌ పార్టీ
    • బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరీహోరీ
    • కేరళంలో యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం
    • అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌, పుదుచ్చేరి కమలం
  • 04 May 2026 10:22 AM (IST)

    ప్రభుత్వ ఏర్పాటు ధీమాగా ఉన్న విజయ్

    • ప్రభుత్వ ఏర్పాటు ధీమాగా ఉన్న విజయ్
    • ఎవరి సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకే
    • మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే పార్టీ
    • తమిళనాడులో 118 స్థానాలు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు
    • ప్రస్తుతం 103 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే
  • 04 May 2026 10:17 AM (IST)

    Kerala Results: సీఎం ఎవరు..?

    • కేరళలో స్పష్టమైన ఆధిక్యంలో UDF
    • ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై జోరుగా చర్చ
    • ముఖ్యమంత్రి రేసులో వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల
  • 04 May 2026 10:07 AM (IST)

    మ్యాజిక్‌ ఫిగర్ దాటిన బీజేపీ

    • పశ్చిమ బెంగాల్‌లో మ్యాజిక్‌ ఫిగర్ దాటిన బీజేపీ
    • 147 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
    • బీజేపీ ఆఫీస్ దగ్గర‌ కనిపిస్తున్న సందడి వాతావరణం
    • తొలిసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం
  • 04 May 2026 10:03 AM (IST)

    సెంచరీ కొట్టిన టీవీకే

    • తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం
    • ఫలితాల సరళిలో సెంచరీ కొట్టిన విజయ్‌ పార్టీ
    • ఈసీ లెక్కల్లోనే మూడోప్లేస్‌లోకి అధికార DMK
    • టీవీకే 38, అన్నాడీఎంకే 36, డీఎంకే 19
    • కొళత్తూరులో సీఎం స్టాలిన్‌ వెనుకంజ..
    • చెపాక్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి వెనుకంజ
    • తమిళనాడులో సీఎం సహా 28 మంది మంత్రుల వెనుకంజ
    •  విజయోత్సావాలను రద్దుచేసుకున్న DMK
    • టెంట్లు తొలగించిన DMK శ్రేణులు
  • 04 May 2026 09:53 AM (IST)

    సీఎం స్టాలిన్ వెనుకంజ

    • ఎగ్జిట్ పోల్స్‌కు అందని తమిళ ఓటరు నాడి
    • తమిళనాడులో వెనుకంజలో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్
    • డీఎంకేదే అధికారమన్న మెజార్టీ సర్వేలు..
    • ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారిన విజయ్ – త్రిష బంధం
  • 04 May 2026 09:48 AM (IST)

    Tamilnadu Election Results: ఆసక్తిరేపుతున్న ఫలితాలు..

    • ఆసక్తిరేపుతున్న తమిళనాడు ఫలితాలు..
    • 90కి పైగా స్థానాల్లో విజయ్ టీవీకే హవా
    • అనూహ్యంగా పుంజుకున్న అన్నాడీఎంకే
    • రెండో స్థానంలోకి దూసుకొచ్చిన అన్నాడీఎంకే
    • మూడో స్థానంలో కొనసాగుతున్న డీఎంకే
  • 04 May 2026 09:34 AM (IST)

    5 రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్లు ఇవే..

    • ఆసక్తికరంగా మారుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
    • తమిళనాడులో 234 స్థానాల్లో ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ 118
    • పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ 148
    • కేరళంలో 140 స్థానాల్లో ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ 71
    •  అసోంలో 126 స్థానాల్లో ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ 64
    • పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ 16
  • 04 May 2026 09:26 AM (IST)

    Kerala Election Result: కేరళలో హోరాహోరీ

    • కేరళలో LDF, UDF కూటముల మధ్య హోరాహోరీ పోటీ
    • ఫలితాల్లో నిమిషాల్లో తారుమారవుతున్న అంకెలు
    • రెండు కూటములు 60కి పైగా స్థానాల్లో ఆధిక్యం
    • 4-5 సీట్లలో NDA అభ్యర్థులు ముందంజ
  • 04 May 2026 09:16 AM (IST)

    TVK Election Result: అత్యధిక స్థానాల్లో టీవీకే ఆధిక్యం

    • తమిళనాడులో అత్యధిక స్థానాల్లో టీవీకే ఆధిక్యం
    •  డీఎంకే పార్టీని దాటి దూసుకెళ్తున్న టీవీకే
    • ఈవీఎంలు ఓపెన్ కాగానే దూసుకెళ్తున్న TVK
    •  పోస్టల్ బ్యాలెట్‌లో రెండో స్థానంలో టీవీకే
    • ఈవీఎలలో మాత్రం దుమ్మురేపుతున్న TVK అభ్యర్థులు
  • 04 May 2026 09:05 AM (IST)

    రెండో స్థానంలో విజయ్ పార్టీ

    • తమిళనాడులో రెండో స్థానంలో విజయ్ పార్టీ
    • తమిళనాట పుంజుకుంటున్న TVK
    • పెరంబూర్‌లో విజయ్ ముందంజ, తిరుచ్చి ఈస్ట్‌లో వెనుకంజ
    • టి నగర్‌లో ఎన్‌.ఆనంద్‌ ముందంజ
    • విల్లివాక్కంలో ఆదవ్‌ అర్జున వెనుకంజ
  • 04 May 2026 08:51 AM (IST)

    బీజేపీ ఆఫీసుకు కీలక నేతలు..

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ – బీజేపీ మధ్య హోరాహోరీ
    • బెంగాల్‌లో బీజేపీ కార్యాలయానికి చేరుకుంటున్న ముఖ్య నేతలు
    • ఆఫీసుకు చేరుకున్న భూపేంద్ర యాదవ్, విప్లవ్ దేవ్ తదితరులు
    • తృణమూల్ ఆఫీస్ దగ్గర కనిపించని సందడి
  • 04 May 2026 08:41 AM (IST)

    2021లో బెంగాల్ ముఖచిత్రం

    • 2021లో బెంగాల్లో 215 స్థానాల్లో విజయం సాధించిన మమతా
    • 77 స్థానాలతో సరిపెట్టుకున్న కమలం పార్టీ
    • గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన మమతా
    • 2021లో 82.3 శాతం పోలింగ్ నమోదు
    • ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో 93శాతం పోలింగ్ నమోదు
    • బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
  • 04 May 2026 08:28 AM (IST)

    తిరుచ్చిలో విజయ్ వెనుకంజ

    • 5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
    • నందిగ్రామ్‌లో సువేందు అధికారి ఆధిక్యం
    • తమిళనాడు తిరుచ్చిలో విజయ్ వెనుకంజ
    • పెరంబూర్‌లో ఆధిక్యంలో విజయ్.. రెండు స్థానాల్లో పోటీ
    • వెస్ట్ బెంగాల్ భవానిపూర్‌లో సీఎం మమతా ఆధిక్యం
    • చెపాక్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
  • 04 May 2026 08:12 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్లలో హోరాహోరీ

    • బెంగాల్‌ పోస్టల్‌బ్యాలెట్లలో TMC, BJP హోరాహోరీ
    • తమిళనాడులో ఆధిక్యంలో DMK
    • అస్సాంలో బీజేపీ ఆధిక్యం
    • కేరళలోనూ LDF, UDF హోరాహోరీ
  • 04 May 2026 08:00 AM (IST)

    Assembly Election Results: కౌంటింగ్‌ ప్రారంభం

    • 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
    • తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
    • బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలపై ఉత్కంఠ
    • ఉదయం పదికల్లా ట్రెండ్‌.. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత
    • బెంగాల్‌, తమిళనాడు, కేరళ వైపే అందరి చూపు
  • 04 May 2026 07:53 AM (IST)

    Puducherry Election Results: పుదుచ్చేరిపై ఎన్డీయే ధీమా

    •  కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
    •  2021 ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకున్న NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
    • మరోసారి రంగసామి సర్కార్‌ రావడం ఖాయమని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి
    •  కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం గెలుపుపై భారీ ఆశలు పెట్టుకుంది
    • ఎగ్జిట్ పోల్స్ మాత్రం NDAదే అధికారమంటూ తేల్చిచెప్పాయి
    • ఏప్రిల్‌ 9న ఒకే దశలో జరిగిన పోలింగ్‌
    • రికార్డు స్థాయిలో 91.23 శాతం పోలింగ్ నమోదు
    • 6 కేంద్రాల్లో కౌంటింగ్‌ ఏర్పాటు చేశారు
  • 04 May 2026 07:43 AM (IST)

    West Bengal Results: రాత్రి నుంచే పలుచోట్ల హైటెన్షన్‌

    • బెంగాల్‌లో రాత్రి నుంచే పలుచోట్ల హైటెన్షన్‌
    • స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెక్యూరిటీపై మమత అనుమానాలు
    • టీఎంసీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
    • అనుమానాస్పద ఘటనలపై వెంటనే ఫిర్యాదులు చేయాలని సూచన
    • CCTV ఫుటేజ్ తప్పనిసరిగా డిమాండ్ చేయాలని ఆదేశం
    • బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తున్న సీఎం మమత
  • 04 May 2026 07:30 AM (IST)

    Exit Polls Results: ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్

    • ఐదు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
    • తమిళనాడులో డీఎంకేకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
    • బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురుతుందన్న సర్వేలు
    • కేరళలో కాంగ్రెస్, అస్సాంలో బీజేపీ గెలుస్తాయని అంచనాలు

  • 04 May 2026 07:22 AM (IST)

    కేరళపై గట్టి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

    • కేరళపై గట్టి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
    • కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు
    • ఓట్ల లెక్కింపుకు 140 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు
    • మ్యాజిక్‌ ఫిగర్‌ 71 సీట్లు కాగా..ఈసారి 78 శాతానికి పైగా ఓటింగ్‌
    • కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
  • 04 May 2026 06:59 AM (IST)

    తమిళనాడు ఫలితాలపై ఉత్కంఠ

    • తమిళనాడు ఫలితాలపై ఉత్కంఠ
    • తమిళనాడులో అసెంబ్లీ స్థానాలు 234
    • కౌంటింగ్‌ కోసం 62 సెంటర్లు ఏర్పాటు
    • పవర్‌ను చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 118
    • ఈ సారి తమిళనాట రికార్డు స్థాయిలో 85శాతానికి పైగా పోలింగ్‌
  • 04 May 2026 06:43 AM (IST)

    దేశం చూపు బెంగాల్‌పైనే..

    • దేశం మొత్తం చూపు బెంగాల్‌పైనే..
    • పశ్చిమ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294
    • ఈ సారి ఎన్నికల్లో 93 శాతం ఓటింగ్‌ నమోదు
    • అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 148
    • కౌంటింగ్‌ కోసం 77 సెంటర్లు ఏర్పాటు
    • బీజేపీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్

  • 04 May 2026 06:35 AM (IST)

    కాసేపట్లో కౌంటింగ్..

    • కాసేపట్లో 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
    • 8 గంటలకు ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు
    • బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలపై ఉత్కంఠ
    • మొదట పోస్టల్ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు
    • ఉదయం పదికల్లా ట్రెండ్‌.. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత
    • బెంగాల్‌, తమిళనాడు, కేరళ వైపే అందరి చూపు

Published On - May 04,2026 6:34 AM

Follow Us