AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: అరెరే ఎంత పనాయెరా.. వేదికపైనే ఆ పని చేసిన వధువు.. ఇక వరుడు ఊరుకుంటాడా..

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే జరిగే అపురూపమైన వేడుక. అందుకే తమ పెళ్లిని పది మంది పది కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని వధూవరులు కలలుకంటుంటారు. అంతే కాకుండా అందుకు తగినట్లు...

Trending Video: అరెరే ఎంత పనాయెరా.. వేదికపైనే ఆ పని చేసిన వధువు.. ఇక వరుడు ఊరుకుంటాడా..
Marriage
Ganesh Mudavath
|

Updated on: Dec 16, 2022 | 12:52 PM

Share

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే జరిగే అపురూపమైన వేడుక. అందుకే తమ పెళ్లిని పది మంది పది కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని వధూవరులు కలలుకంటుంటారు. అంతే కాకుండా అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. అయితే కొన్ని పెళ్లిళ్లు హంగూ ఆర్భాటాలతో ఫేమస్ అయితే.. మరికొన్ని మాత్రం గొడవలతో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. భోజనం పెట్టలేదనో, చికెన్, మటన్ వడ్డించలేదనో, వరుడికి తగినంత కట్నం ఇవ్వలేదనో.. ఇలా కారణాలు ఎన్నైనా.. ఆఖరికి దారి తీసేది గొడవకే. ఈ కోవలోకే వస్తోంది ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో. అయితే ఈ వీడియోలో వధూవరుల బంధువుల మధ్య గొడవ జరిగిందని భావించవచ్చు. కానీ మీరు అనుకుటున్నది కరెక్ట్ కాదు. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడటంతో పాటు ఈ స్టోరీని కూడా చదివేయండి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. వధూవరులు వేదికపై నిలబడి ఉన్నారు. జయమాల ధారణ చేసుకునే సమయంలో ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటారు. అయితే వరుడు వధువు నోట్లో స్వీట్ పెట్టగానే ఆమె చాలు అంటూ సైగ చేస్తుంది. అయినా వరుడు ఆగకుండా బలవంతంగా తినిపించేందుకు ట్రై చేస్తాడు. వరుడు చేసిన పనికి వధువుకు చిర్రెత్తుకొచ్చింది. ముందు వెనకా చూడకుండా ఎడపెడా వాయించేసింది. ఇక వరుడు ఊరుకుంటాడా.. అతను కూడా ఇష్టమొచ్చినట్లు వధువును కొట్టాడు. ఊహించని ఈ ఘటనకు మండపంలో ఉన్న వారి బంధువులు షాక్ అయ్యారు. వెంటనే అలర్ట్ అయ్యి.. వారిని కంట్రోల్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. వార్త రాసే వరకు వీడియోకు 86 వేలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తు్న్నాయి. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..