CM Jagan: ఆ నియోజకవర్గం నేతలకు సీఎం కీలక ఆదేశాలు.. గ్యాప్ ఉండకూడదని సూచన

ఇంటింటికీ వెళ్లాలి. పార్టీని మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. విభేదాలు ఉంటే ఇప్పుడే పరిష్కరించుకోవాలి. మైలవరం కేడర్‌కు సీఎం జగన్‌ చేసిన దిశానిర్దేశం ఇదీ. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు, జోగి రమేష్‌కు మధ్య గ్యాప్‌పైనా ఫోకస్‌ పెట్టారు జగన్‌. వారం రోజుల్లో ఇద్దరూ కలిసి రావాలని సూచించారు.

CM Jagan: ఆ నియోజకవర్గం నేతలకు సీఎం కీలక ఆదేశాలు.. గ్యాప్ ఉండకూడదని సూచన
AP CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 15, 2022 | 9:53 PM

2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని పరుగులు పెట్టిస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఒక్కో నియోజకవర్గంపై సమీక్షలను కంటిన్యూ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తోపాటు నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిని, ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. మైలవరం నియోజకవర్గంలోనే లబ్ధిదారులకు నేరుగా 900 కోట్ల సాయం చేశామని లెక్కలు చెప్పారు సీఎం జగన్‌.

89 శాతం ఇళ్లకు DBT పథకాలు అందాయని, ఇంటింటికీ వెళ్లి చేసిన మంచిని చెప్పుకోవాలన్నారు. జనవరి నుంచి బూత్‌ కమిటీలు, 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథుల్ని నియమించాలని నేతల్ని ఆదేశించారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు, మంత్రి జోగి రమేష్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ చర్చకు వచ్చింది. గ్యాప్‌ ఉంటే రండి.. మాట్లాడదాం.. తలో కప్పు కాఫీ తాగి వెళ్దురు. ఎస్, ఈ మాటలన్నది సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమావేశం నిర్వహించారాయన.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌తో నెలకొన్న విభేదాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వారంలో ఇద్దరూ కలిసి రావాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టడంతో మంత్రి, ఎమ్మెల్యే మధ్య గ్యాప్‌కు ఇకపై ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉందని కేడర్‌ భావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం