UCIL Recruitment 2022: డిప్లొమా అర్హతతో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 11 ఫోర్‌మ్యాన్ (మెకానికల్) పోస్టుల భర్తీకి..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 11 ఫోర్‌మ్యాన్ (మెకానికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు జనవరి 16, 2023వ తేదీ నాటికి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు జనవరి 16, 2023వ తేదీన ఉదయం 9 గంటల 30 నిముషాలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.46,020ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: The Conference room of New Administrative Building-Jaduguda, URANIUM CORPORATION OF INDIA LIMITED, PO: Jaduguda Mines, Distt. Singhbhum (East), Jharkhand – 832102.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.