Coronavirus: సండే కరోనా వ్యాప్తికి సెలవు లేదండి..! ఆదివారం చేపల మార్కెట్లు, మాంసం దుకాణాల వద్ద ఏందీ లొల్లి
ఆదివారం కోసం మాంసపు ప్రియులే కాదు.. కరోనా కూడా ఎదురు చూస్తుంటుంది. సండే వచ్చిందంటే చాలు కరోనా పండగ చేసుకుంటుంది. వారం అంతా....
ఆదివారం కోసం మాంసపు ప్రియులే కాదు.. కరోనా కూడా ఎదురు చూస్తుంటుంది. సండే వచ్చిందంటే చాలు కరోనా పండగ చేసుకుంటుంది. వారం అంతా ఇంట్లో దాక్కుంటున్న మనుషుల కోసం చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాల దగ్గర మాటు వేసి కూర్చుంటుంది. ఇక ఆదివారం పూట విచ్చలవిడిగా బయటికి వస్తున్న జనం మీద పంజా విసురుతుంది. హైదరాబాద్ రామ్ నగర్ ఫిష్ మార్కెట్ లో ఆదివారం రద్దీ కిటకిటలాడుతోంది. భౌతిక దూరం పాటించకుండా మాంసపు ప్రియులు ఒకరినొకరు తోసుకుంటూ చేపల కోసం ఎగబడుతున్నారు. లాక్ డౌన్ దృష్ట్యా 10 గంటల వరకే ఫిష్ మార్కెట్ లో అమ్మకాలు ఉండటంతో చేపలు దొరుకుతాయో లేదోననే ఆతృతతో కరోనాను సైతం లేక్క చేయడం లేదు.
అటు ఏపీలోనూ ఆదివారం ఫిష్ మార్కెట్లన్నీ సందడిగా మారుతున్నాయి. ఏలూరు చేపల మార్కెట్లో విచ్చలవిడిగా తిరుగుతున్న జనాలు కరోనాను వ్యాప్తి చేస్తున్నారు. చేపలు , మాంసం కోసం దుకాణాల దగ్గర భారీగా రద్దీ నెలకొంటోంది. భౌతిక దూరం పాటించమంటూ పోలీసులు మైకుల్లో ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా వచ్చి ఎంత డ్యామేజ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎంతో మంది అయినవాళ్లను, ఆప్తులను కోల్పోయారు. రోజూ ఎన్నో కన్నీటి వ్యధలు వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో చూస్తేనే ఉన్నారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు తోటివాళ్ల జీవితాలు కూడా కాపాడండి.
Also Read: గంగిరెద్దును ఆడిస్తూ సన్నాయి వాయిస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్.. అతడికి సినిమా ఛాన్స్