AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘ఆ నలుగురు’ సినిమా సీన్ రిపీట్.. వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్న అప్పులిచ్చినవాళ్లు

వచ్చే జీతం వేలల్లో మాత్రమే. అది కుటుంబ పోషణకే సరిపోదు. కానీ చెల్లించాల్సిన అప్పులు మాత్రం కోట్లలో ఉన్నాయి. ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో అతడికి బ్రతుకు నరకం అనిపించింది. చివరకు...

Telangana: 'ఆ నలుగురు' సినిమా సీన్ రిపీట్.. వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్న అప్పులిచ్చినవాళ్లు
Tragedy
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2022 | 3:49 PM

Share

అప్పు..పెనుముప్పైంది. చివరకు ప్రాణాలు తీసింది. జీతం వేలల్లో…అప్పులు కోట్లలో ఉండటంతో తట్టుకోలేకపోయాడు. వడ్డీ పెరిగిపోయి..అప్పులిచ్చిన వారి టార్చర్‌ ఎక్కువైపోయింది. ఎలా తీర్చాలో తెలియక..దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సూర్యాపేటజిల్లా( Suryapet district)లో జరిగింది. మునగాల మండలం(Munagala mandal) విజయరాఘవపురం(Vijayaraghavapuram)లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అందిన కాడికి అప్పులు చేసి.. వాటిని తీర్చలేక గోదేశి నరేంద్రబాబు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన గవర్నమెంట్ టీచర్‌గా పనిచేసేవాడు. సుమారు 25 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అప్పులిచ్చిన వాళ్లకు ఇన్నాళ్లు ఏదో ఒకటి చెప్తూ వచ్చిన నరేంద్రబాబు.. ఇక, అప్పులు తిరిగి చెల్లించలేననే నిర్ణయానికి వచ్చాడు. సూర్యాపేట వెళ్లి ఉరేసుకున్నాడు. డెడ్‌బాడీని ఊళ్లోకి తీసుకొచ్చేందుకు నరేంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. అప్పులోళ్లు అడ్డుకున్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లిస్తేనే.. డెడ్‌బాడీని ఊర్లోకి రానిస్తామంటున్నారు. డెడ్‌బాడీని తీసుకొచ్చిన వెహికల్‌ ఊళ్లోకి రాకుండా.. రోడ్డుపై ముళ్ల కంచె వేశారు. అంత్యక్రియలు జరగనిచ్చేది లేదంటూ బాధితులు చెప్తున్నారు.

అయితే తన భర్త చేసిన అప్పులు గురించి తనకేం తెలియదంటోంది నరేంద్రబాబు భార్య. గవర్నమెంట్‌ టీచరైన నరేంద్రబాబు.. కోట్ల రూపాయల్లో అప్పులు ఎందుకు చేశాడు..? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో డబ్బులు పెట్టి మోసపోయాడా..? మేటర్‌ పోలీసులకు వరకు వెళ్లడంతో.. విజయరాఘవాపురంలో ఉద్రిక్తత నెలకొంది.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!