AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగబోతోంది.. రాజగోపాల్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Telangana: తన త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగబోతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Telangana: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగబోతోంది.. రాజగోపాల్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..
MLA Komatireddy Rajagopal Reddy
Shiva Prajapati
|

Updated on: Aug 12, 2022 | 3:37 PM

Share

Telangana: తన త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగబోతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడున్నరేళ్లుగా మునుగోడు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నానని అన్నారు. రాజకీయంలోకి రాకముందే తాను వ్యాపారవేత్తను, వ్యాపారం కోసమే రాజకీయం చేసే గుణం తనది కాదన్నారు. ఈ నెల 20న కేసీఆర్ హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని, తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారనే నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడేన్నరేళ్ళలో పట్టించుకోని వీరంతా రేపటి నుంచి డబ్బు సంచులతో తిరుగుతారని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి విమర్శలు గుప్పించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కు జరుగుతున్న యుద్ధమే వచ్చే ఉప ఎన్నిక అని వ్యా్ఖ్యానించారు.

కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాజాగా తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు అభివృద్ధి చెందటం లేదని, తన రాజీనామాతోనైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరికొద్ది రోజుల్లో ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!