Watch: ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి కట్టేయాలి.. హీరో నాగార్జునకు CPI నారాయణ సూచన
హీరో అక్కినేని నాగార్జునకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేయలేదని.. ఎన్ కన్వెన్షన్ దగ్గరకు వచ్చి చెప్పగలరా అని సవాల్ చేశారు. చెరువును కబ్జా చేసి, దొంగ పట్టాలు సృష్టించిన హీరో నాగార్జున.. సినిమా డైలాగులు కొడతానంటే నడవదని విమర్శించారు.
హీరో అక్కినేని నాగార్జునకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేయలేదని.. ఎన్ కన్వెన్షన్ దగ్గరకు వచ్చి చెప్పగలరా అని సవాల్ చేశారు. చెరువును కబ్జా చేసి, దొంగ పట్టాలు సృష్టించిన హీరో నాగార్జున.. సినిమా డైలాగులు కొడతానంటే నడవదని విమర్శించారు. ఈ పదేళ్ల పాటు ఎన్‌కన్వెన్షన్ ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి కట్టేయాలన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీపీఐ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్న చెప్పిన ఆయన.. అదే సమయంలో పేద వాళ్లపై ప్రతాపం చూపకుండా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమంగా నిర్మించిన బిల్డింగులను కూడా కూల్చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చారు. వారు చెరువులు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటును స్వాగతించిన సీపీఐ నారాయణ.. హైదరాబాద్ చుట్టుపక్కల కుంటలు, చెరువులను కాపాడాలన్నారు. అక్రమ కట్టడాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని సూచించారు.
ఫ్యాన్స్‌కు హీరో నాగార్జున వినతి..
అక్రమంగా చెరువును ఆక్రమించుకుని నిర్మించారంటూ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడం తెలిసిందే. అయితే ఇది పట్టా భూమిలోనే నిర్మించామంటూ అక్కినేని నాగార్జున ఇది వరకే వివరణ ఇచ్చారు. కోర్టు స్టే ఆర్టర్ ఉన్నా దీన్ని కూల్చివేయడం చట్ట విరుద్ధమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తాను చెరువును ఆక్రమించుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని చేపట్టినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నాగార్జున స్పష్టంచేశారు. ఒక్క సెంటు భూమిని కూడా ఆక్రమించలేదన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపిన నాగార్జున.. కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామన్నారు. అప్పటివరకు దీనిపై జరుగుతున్న పుకార్లు, ఊహాగానాలను నమొద్దని తన అభిమానులు, శ్రేయోభిలాషులను కోరుతున్నట్లు చెప్పారు.
అక్కినేని నాగార్జున ప్రకటన.
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,
N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి




