Corona Medicine: కరోనా సోకి హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ఈ మెడిసిన్స్ వాడండి.. తెలంగాణ సర్కార్ ప్రకటన..
Corona Medicine: మాయదారి కరోనా మరోసారి తీవ్రరూపం దాల్చింది. అందిన కాడికి నాదేనంటూ.. ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది.
Corona Medicine: మాయదారి కరోనా మరోసారి తీవ్రరూపం దాల్చింది. అందిన కాడికి నాదేనంటూ.. ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. ఆ దేశం, ఈ దేశం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేకుండా అంతటా విస్తరిస్తోంది. ప్రజల అప్రమత్తతే వారికి శ్రీరామ రక్ష అని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు చేతులను తరచూ శుభ్రపరుచుకోవడం, విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే.. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో లక్షణాలు లేని వారే అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇలాంటి వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తోంది ప్రభుత్వం. తాజాగా తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారు వినియోగించాల్సిన మెడిసిన్ లిస్ట్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఏ మెడిసిన్స్ తీసుకోవాలి, ఏ సమయంలో వేసుకోవాలనే వివరాలను కూలంకశంగా పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
తెలంగాణ వైద్యారోగ్యశాఖ ట్వీట్ ‘‘దయచేసి గమనించండి! ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ బాధితులు డాక్టర్ సలహాతో వాడవలసిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు.’’ అని పేర్కొన్నారు. మందుల లిస్ట్ కోసం కింద చూడొచ్చు.
దయచేసి గమనించండి!
ఇంటి వద్ద ఐసోలేశన్ లో ఉన్న కోవిడ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాతో వాడవలసిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు ?#COVID19 pic.twitter.com/ykt2r0aFzT
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) January 18, 2022
Also read:
ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!