Covid-19 Vaccine: టీవీ9 నెట్‌వర్క్ , శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ అధ్వర్యంలో.. హైవే హీరోస్‌కు కరోనా టీకాలు
TV9 Network, Shriram Transport Finance: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అందరికీ టీకా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం

TV9 Network, Shriram Transport Finance: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అందరికీ టీకా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. అయితే.. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొన్ని సంస్థలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. కరోనా ముప్పు ఇంకా సమసిపోలేదు. ప్రధానంగా హైవేస్‌పై ప్రయాణించే ట్రక్కు డ్రైవర్లకు, క్లీనర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో హైవే హీరోస్ కోసం.. టీవీ9 నెట్‌వర్క్ శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ అధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేడ్చెల్‌లో టీవీ9 నెట్‌వర్క్ , శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో హైవే హీరోస్‌కు టీకాలను ఉచితంగా పంపిణీ చేశారు. మేడ్చెల్‌లోని గోయల్ బ్రదర్స్ ఇండియన్ ఆయిల్ బంకులో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి.. ఉచితంగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. ఉచిత ఆరోగ్య శిబిరం కూడా చేశారు. మూడు రోజుల పాటు అత్యధిక సంఖ్యలో డ్రైవర్లు, క్లీనర్లకు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ అందించారు. టీవీ9 సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించామని శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ తెలుగు రాష్ట్రాల జోనల్ అధికారి హమ్జా అలీ పేర్కొన్నారు. హైవే హీరోస్‌కు ఈ కార్యక్రమంలో గోయల్ పెట్రోల్ బంకు నిర్వహకులు పాల్గొన్నారు.
Also Read:
