Viral Video: వీళ్లను ఏమనాలి.. టపాసులు కాల్చి పెట్రోల్ బంకుపై విసిరిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Major tragedy: ఇద్దరు యువకులు.. బైక్‌పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ కొట్టించుకున్నారు. ఈ క్రమంలో.. వెళుతువెళుతూ ఓ యువకుడు.. చేతిలోనున్న
Major tragedy: ఇద్దరు యువకులు.. బైక్‌పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ కొట్టించుకున్నారు. ఈ క్రమంలో.. వెళుతువెళుతూ ఓ యువకుడు.. చేతిలోనున్న టపాసులకు నిప్పంటించి బంకుపై విసిరాడు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకుకు నిప్పంటించే ప్రయత్నంలో భాగంగానే యువకుడు దానిపై విసిరేసినట్లు పేర్కొంటున్నారు. సిబ్బంది అప్రమత్తం కాకపోతే.. ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించేది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పిప్లాడ్ ప్రాంతంలోని పెట్రోల్ పంపులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన అన్ని దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ నింపుకునేందుకు ఇద్దరు యువకులు స్కూటిపై అక్కడికి వచ్చారు. ముందు బైక్‌ను నడిపిన వ్యక్తి పెట్రోల్ నింపుకున్న తర్వాత వెనుకకు వెళ్లాడు. వెనుక కూర్చున్న వ్యక్తి బైక్‌ను స్టార్ట్ చేశాడు. అనంతరం వెళ్లిపోయే ముందు టపాసులకు నిప్పంటించి పెట్రోల్ పంపు మీదకు విసిరి వేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఒకరు.. ఆ క్రాకర్‌ను పైపు దగ్గర నుంచి కాలితో నెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఆ టపాసు కొంచెం దూరంలో పేలింది. పైపు దగ్గర క్రాకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది.
వీడియో..
A man gets caught on camera, deliberately throwing firecrackers at a petrol pump to cause a fire.
Now after he is caught, @RanaAyyub will write an op-ed in the New York Times about how Human Rights of Muslims are being trampled upon in India. This is what we’re up against!! . pic.twitter.com/ncsZfi3ol5
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) November 3, 2021
ఈ ఘటన అనంతరం పెట్రోల్ పంప్ మేనేజర్ మోతీలాల్ చౌదరి.. యువకులపై ఉమ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 285, 286, 336, 114 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాను పరిశీలించిన అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరి పేరు మహ్మద్ ఇర్ఫాన్ ఖురేషీగా పేర్కొంటున్నారు.
Also Read: