TS Corona: తెలంగాణాలో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు.. మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా

TS Corona: తెలంగాణాలో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు.. మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా
Ts Corona Virus

TS Corona Virus: దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా మళ్ళీ కరోనా కేసులు నమోదతో పాటు.. ఒమిక్రాన్ కేసులు  పెరుగుతున్న వేళ .. ప్రభుతం అలెర్ట్ అయ్యింది.  తాజాగా ప్రధాన కార్యదర్శి..

Surya Kala

|

Jan 01, 2022 | 9:32 PM

TS Corona Virus: దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా మళ్ళీ కరోనా కేసులు నమోదతో పాటు.. ఒమిక్రాన్ కేసులు  పెరుగుతున్న వేళ .. ప్రభుతం అలెర్ట్ అయ్యింది.  తాజాగా ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు.

ఒమిక్రాన్, కోవిడ్ కేసుల వ్యాప్తి నేపధ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు మతపరమైన, రాజకీయ మరియు సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలతో సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రజా రవాణాలో, దుకాణాలు, మాల్స్, సంస్థల నిర్వహణలు, ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని , భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. అంతేకాదు కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని.. ఐఆర్ థర్మామీటర్ లేదా థర్మల్ స్కానర్, శానిటైజర్ సదుపాయలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని పాఠశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని సోమేష్ కుమార్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని  సోమేష్ కుమార్  పేర్కొన్నారు.

Also Read : హిందువులు కాని వారికి అనుమతి లేని ఆలయం ఎక్కడో తెలుసా..  

అభయారణ్యంలో అరుదైన హానీబాడ్జర్‌.. రుచికరమైన ఆహారంకోసం ఎంతదూరమైన పయనించే గుణం దీని సొంతం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu