Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 6 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..

Telangana Corona Updates: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 6 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..
Corona Updates
Follow us

|

Updated on: May 05, 2021 | 10:54 AM

Telangana Corona Updates: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 77,435 మంది నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించగా.. 6,361 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక ఇదే సమయంలో భారీ స్థాయిలో రికవరీలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో 8,126 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 77,704 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంతమంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 82.91 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. తెలంగాణ ఇప్పటి వరకు 4,69,722 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 3,89,491 మంది కోలుకున్నారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 2,527 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలాఉంటే.. తాజాగా రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా 1,225 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు.. పలు జిల్లాల్లోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో -178 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. కామారెడ్డి జిల్లాలో 107, కరీంనగర్ జిల్లాలో -248, ఖమ్మం – 188, మహబూబ్‌నగర్ – 224, మహబూబాబాద్ – 107, మంచిర్యాల – 148, మేడ్చల్ మల్కాజిగిరి – 422, నాగర్‌కర్నూల్ – 190, నల్లగొండ – 453, నిజామాబాద్ – 164, పెద్దపల్లి – 100, రంగారెడ్డి జిల్లాలో – 423, సంగారెడ్డి – 227, సిద్దిపేట – 244, సూర్యాపేట – 239, వికారాబాద్ – 148, వనపర్తి – 110, వరంగల్ అర్బన్ – 234, యాదాద్రి భువనగిరి – 162 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

India Corona Updates: భారత్‌లో కరోనా విలయతాండవం.. దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Effect: నేటి నుంచి ఆంధ్రాలో అమల్లోకి కర్ఫ్యూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్.. అమలు బాధ్యత కలెక్టర్లకు..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.