AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harassments: నర్సును వేధింపులకు గురిచేస్తున్న డాక్టర్..ఆసుపత్రిలోనే అసభ్యంగా ఆమె పట్ల దారుణం..

Harassment in Hospital: సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి పాడు బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. తన తోటివారిని జాగ్రత్తగా చూడాల్సిన వారే.. వారి పాలిట శత్రువుల్లా తయారు అవుతున్నారు.

Harassments: నర్సును వేధింపులకు గురిచేస్తున్న డాక్టర్..ఆసుపత్రిలోనే అసభ్యంగా ఆమె పట్ల దారుణం..
Harrasement In Hospital
KVD Varma
|

Updated on: May 05, 2021 | 9:12 AM

Share

Harassments: సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి పాడు బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. తన తోటివారిని జాగ్రత్తగా చూడాల్సిన వారే.. వారి పాలిట శత్రువుల్లా తయారు అవుతున్నారు. ప్రాణాలు పోసే పవిత్రమైన డాక్టర్ ఉద్యోగంలో ఉండి తోటివారిని లైంగికంగా వేధిస్తూ పైశాచికానందం అనుభవిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట పని చేస్తున్న చోట మహిళలకు లైంగిక వేధింపులు తప్పటం లేదు. తాజాగా, జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయాల్సిన డాక్టర్ వేధింపులకు దిగాడు. సాటి నర్స్ పట్ల అసభ్యంగా..కామాంధుడిగా వ్యవహరించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఇక్కడి శ్రీలక్ష్మీ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కోరుట్లలోని శ్రీలక్ష్మీ ఆసుపత్రిలో రాజేష్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడే బాధితురాలు నర్సుగా పనిచేస్తోంది. కొంతకాలంగా ఆ డాక్టర్ బాధితురాలిని వేధిస్తూ వస్తున్నాడు. ఆమెను లైంగికంగా హింసిస్తున్నాడు. తన మాటలతో చేష్టలతో ఆమె పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. చివరికి మొన్న సోమవారం ఆమెను లైంగికంగా విపరీతమైన వేధింపులకు గురిచేయడంతో సహించలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో డాక్టర్ రాజేష్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సతీష్ తెలిపారు. అతనిపై లైంగిక వేధింపుల చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా? నడిరోడ్డు మీద యువకుడి వీరంగం!

నన్ను పెళ్లి చేసుకుంటావా… లేదా అంటూ ఓ యువతిని కొట్టాడో యువకుడు. తనకు పదేపదే ఫోన్‌ చేసి విసిగిస్తుండడంతో ఆ యువతి నారాయణగూడ పోలీసులును ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కవాడిగూడకు చెందిన యువతి నారాయణగూడలోని ఓ కూరగాయల షాప్‌లో పనిచేస్తోంది. బన్సీలాల్‌పేటకు చెందిన వేణు ఆ యువతి కొంతకాలంగా చనువుగా ఉన్నారు. ఇద్దరి మధ్యా కొద్దిరోజుల క్రితం వాగ్వాదం జరిగింది. దీంతో వేణుతో ఆమె మాట్లాడటం మానేసింది. ఆటను ఫోన్ చేసినా మిన్నకుంది.

ఇతని గోల భరించలేని ఆ యువతి తాను పనిచేస్తున్న షాప్ నుంచి నారాయణగూడ వైఏంసీ సమీపంలోని ఒక కూరగాయల స్టోర్‌లో ఉద్యోగానికి చేరింది. ఈవిషయం తెలిసిన వేణు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశాడు. దానికి ఆ యువతి రెస్పాండ్ కాలేదు. దీంతో అతను షాప్ దగ్గరకు వచ్చి ఆమెను బయటకు పిలిచాడు. ఆమె బయటకు వచ్చిన వెంటనే ఆ యువకుడు ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ‘ఫోన్‌ చేస్తే ఎందుకు ఎత్తడం లేదు…పెళ్లి అంటే ఏం మాట్లాడవెందుకు’ అంటూ ఆమెను విపరీతంగా కొట్టసాగాడు.

దీంతో ఆ యువతి తన చెల్లికి, తండ్రికి ఫోన్ చేసింది. అక్కడకు ఆమె చెల్లి వెంటనే చేరుకుంది. అతని బారి నుంచి ఆ యువతిని పక్కకు లాగింది. ఈలోపు తండ్రి వచ్చాడు. వెంటనే వేణు అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Suicide: ప్రేమ నిరాకరించిన యువకుడు.. శానిటైజర్ సేవించి యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటి ముందు బంధువుల ఆందోళన

Road Accident: నెల్లూరులో విషాదం.. పనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు కూలీల దుర్మరణం..