Suicide: ప్రేమ నిరాకరించిన యువకుడు.. శానిటైజర్ సేవించి యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటి ముందు బంధువుల ఆందోళన

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

Suicide: ప్రేమ నిరాకరించిన యువకుడు.. శానిటైజర్ సేవించి యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటి ముందు బంధువుల ఆందోళన
Follow us
Balaraju Goud

|

Updated on: May 04, 2021 | 10:01 PM

Young Woman Suicide: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ యువతి.. అదే మండలంలోని తుమ్మూరు గ్రామానికి చెందిన యువకుడి ప్రేమలో పడింది. అయితే, ఆ యువకుడికి మరో యువతితో పరిచయం ఉందని తెలిసి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మ‌ృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాదులోని ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ప్రత్యూ్ష అనే యువతితో పరిచయం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, ఆమె కంటే ముందే మరో యువతితో అతనికి పరిచయం ఉంది. ఈ విషయం గ్రహించిన ప్రత్యూష.. ఇద్దరిలో ఎవరు ఇష్టం అని యువకుడిని నిలదీసింది. దీంతో తనకు మరో యువతి అంటేనే ఇష్టం అని చెప్పడంతో మనస్తాపానికి గురైంది యువతి.

తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష హైదరాబాద్‌లోని తన రూమ్‌లో శానిటైజర్ తాగి ఆ విషయం తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపింది. స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకుని హుటాహుటీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి ఇవాళ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు మృతదేహన్ని ప్రియుడు ఇంటిముందు ఉంచి ఆందోళనకు దిగారు.

యువతి నుండి లక్ష రూపాయలు నగదు, బహుమతులు యువకుడు తీసుకున్నాడని, నమ్మబలికి యువతిని లోబరుచుకున్నాడని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Viral: నీటిలో ఈత కొడుతోన్న కోతి.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో.!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో