AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renanth Reddy: విజయభేరి సభలో రేవంత్ రెడ్డికి అభిమాని ఆఫర్.. ప్లకార్డ్‌లో ఏం రాశాడో తెలుసా..?

Telangana Congress: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు సోనియా, రాహుల్, ఖర్గే సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు తాము అధికారంలోకి వస్తే హామీలను పక్కాగా అమలు చేస్తామంటూ 6గ్యారెంటీలను ప్రకటించింది.

Renanth Reddy: విజయభేరి సభలో రేవంత్ రెడ్డికి అభిమాని ఆఫర్.. ప్లకార్డ్‌లో ఏం రాశాడో తెలుసా..?
Revanth Reddy
Yellender Reddy Ramasagram
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 18, 2023 | 7:24 AM

Share

Telangana Congress: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు సోనియా, రాహుల్, ఖర్గే సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు తాము అధికారంలోకి వస్తే హామీలను పక్కాగా అమలు చేస్తామంటూ 6గ్యారెంటీలను ప్రకటించింది. మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా స్కీమ్, ఇందిరిమ్మ ఇళ్ల స్కీమ్, గృహజ్యోతి పథకం స్కీమ్, చేయూత స్కీమ్, యువ వికాసం.. ఆరు గ్యారెంటీల హామీ పత్రంతో వివరాలను విడుదల చేసింది. కాంగ్రెస్ విజయభేరీ సభకు వేలాది మంది కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, ఈ సభకు వచ్చిన రేవంత్ అభిమాని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఓ ప్లకార్డ్ చూపిస్తూ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ అభిమాని ఆ ఫ్లకార్డ్‌లో ఏం రాశాడో చూస్తే షాక్ అవ్వడం ఖాయం..

విజయభేరీ సభ ద్వారా తెలంగాణ లో 6 గ్యారంటీ హామీలను ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే.. అదే సభకి వచ్చిన ఓ కాంగ్రెస్ అభిమాని అందరూ షాక్ అయ్యేలా రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ ను ప్లకార్డ్ పై రాసి.. సభ లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ప్రదర్శించాడు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న మోడీ, కేసీఆర్ లను అధికారంలో నుంచి దింపితే తనకు ఎంపీగా అవకాశం ఇస్తారా..? అంటూ షో చేశాడు. ‘‘రేవంత్ సార్.. మోడీ, కేసీఆర్ ను అధికారం నుంచి దింపితే.. నాకు ఎంపీ టికెట్ ఇస్తారా..’’ అంటూ దానిలో రాసి ఉంది. ఇది చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు షాకయ్యారు.

వీడియో చూడండి..

కాగా.. కర్ణాటక తరహాలో గ్యారంటీలను ప్రకటిస్తూ తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ ప్రజలను, ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ప్రకటిస్తే.. ఇతనెవ్వరో కాని తెలంగాణలో అధికారం కోసం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడినే ఇలా అడిగాడెంటి..? అంటూ చూసిన వారంతా చర్చించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..