AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘అవన్నీ కేసీఆర్ పథకాల నుంచి కాపీ కొట్టినవే’.. కాంగ్రెస్‌పై హరీష్‌ ఫైర్‌

కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అస‌లు కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డ‌తాయ‌నే గ్యారంటే లేదన్నారు. ఇక కాంగ్రెస్ చెప్పిన ప్రతీ గ్యారెంటీ కూడా కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే అని హరీష్‌ అన్నారు. అసలు కాంగ్రెస్‌ జాతీయ పార్టీనా …? ప్రాంతీయ పార్టీనా ..? అని ప్రశ్నించిన హరీష్‌ రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు అన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు అమలు...

Telangana: 'అవన్నీ కేసీఆర్ పథకాల నుంచి కాపీ కొట్టినవే'.. కాంగ్రెస్‌పై హరీష్‌ ఫైర్‌
Harish Rao - CM KCR
Narender Vaitla
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 18, 2023 | 6:18 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రం ఎవరి దయతోనూ రాలేదని, ప్రజలే పోరాడి గెలుచుకున్నారని అన్నారు మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్‌ దయతో తెలంగాణ ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం జరిగిన సోనియా సభపై హరీష్‌ స్పందిస్తూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. అల‌వికాని హామీలు, అబ‌ద్ధాల ఆరోప‌ణ‌లు, చ‌రిత్ర వక్రీక‌ర‌ణ‌లు.. కాంగ్రెస్ స‌భ సాంతం ఆత్మ‌వంచ‌న‌, ప‌ర‌నింద‌గా సోనియా స్పీచ్ సాగిందని విమర్శిచారు.

కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అస‌లు కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డ‌తాయ‌నే గ్యారంటే లేదన్నారు. ఇక కాంగ్రెస్ చెప్పిన ప్రతీ గ్యారెంటీ కూడా కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే అని హరీష్‌ అన్నారు. అసలు కాంగ్రెస్‌ జాతీయ పార్టీనా …? ప్రాంతీయ పార్టీనా ..? అని ప్రశ్నించిన హరీష్‌ రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు అన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. హమీలపై సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా..? ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

హరీష్‌ రావు ఇంకా మాట్లాడుతూ..’ మీరిచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల న‌డ్డి విరిచారు. అక్క‌డ మీరు ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తున్నారా..? ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం మీరు. తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా..? ఎందుకు చెప్పలేకపోతున్నారు..?

ఇక ‘రాహుల్‌ గాంధీ గారూ మీ అజ్ఞానానికి జోహార్లు. రాష్ట్రపతి ఎన్నికల్లో మేం బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. కావాలంటే మీరు పేపర్లు తిరగేసి చూడండి. మేం యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చాం. బాజాప్తా ఆయనకు మా పార్టీ ఓటేసింది. తెలంగాణాకు యశ్వంత్‌ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టాం. మీ నేతలనే అడగండి. అవగాహన పెంచుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మేము బీజేపీకి మద్దతు ఇవ్వలేదు.మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉన్నదా.. లేదా..? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు..? ఎందుకీ నయవంచక ముచ్చట్లు’ అంటూ హరీష్‌ రావు విరుచుకుపడ్డారు.

ఇక నేషనల్ హెరాల్డ్‌ కేస్‌పై స్పందించిన హరీష్‌.. ఆ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పగలరా.? అని ప్రశ్నించారు. రాబర్ట్‌వాద్రా కంపెనీల అక్రమాలపై బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేలపై ఈడీ కేసులు ఎందుకు లేవన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మిలాఖాత్‌ కావడం ప్రపంచానికి తెలిసిన విషయమేనన్నారు. అవినీతి గురించి కాంగ్రెస్‌ మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుందని ఎద్దేవా చేశారు. మీ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే.. వేలున్నాయి. స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే మీరు. మీది కాంగ్రెస్‌ కాదు.. స్కాంగ్రెస్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..