AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి

Telangana: జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల..

Telangana: కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి
Subhash Goud
|

Updated on: Jun 07, 2025 | 7:50 AM

Share

అక్కడ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు.. ఇక్కడ క్యాడర్‌లో కన్ఫ్యూజన్‌. కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. వీటికి పరిష్కారం వెతకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరేలా కార్యాచరణ రూపొందించాలన్నారామె. గత పదిరోజులుగా తెలంగాణలో మకాం వేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ హారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్. పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలకు కొంతమంది అబ్జర్వర్స్‌ను నియమించి.. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంతనాలు జరిపారు. వారి సమస్యలను, సూచనలను నోట్‌ చేసుకున్నారు.

శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆధిపత్యపోరుతో పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని రేవంత్‌కు చెప్పారు మీనాక్షి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌ బలహీనంగా ఉందన్నారు నటరాజన్. ప్రభుత్వ పథకాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారన్నారామె. ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలు చూపాలని రేవంత్‌కు తెలిపారు మీనాక్షి.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నిర్ణయించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయమన్నారు సీఎం రేవంత్‌.

ఇది కూడా చదవండి: Musk’s Starlink: భారత్‌లో స్టార్ లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కేంద్రం ఆమోదం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి