Munugode Bypoll: ఆస్ట్రేలియా నుంచి నేరుగా మునుగోడుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పక్కా వ్యూహంతో అదేనా..
మునుగోడు ఉప ఎన్నికకు కొద్దిరోజుల గడువు ఉండగానే వెంకట్ రెడ్డి తిరిగి రావడంతో.. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఆస్ట్రేలియా టూర్ నుంచి తిరిగి వచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్లగొండలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోనంటూ విదేశాలకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన తరువాతే మళ్లీ అక్కడ అడుగు పెడతారని అంతా అనుకున్నారు. కానీ మునుగోడు ఉప ఎన్నికకు కొద్దిరోజుల గడువు ఉండగానే వెంకట్ రెడ్డి తిరిగి రావడంతో.. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల క్రితం తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా కోమటిరెడ్డి విషయంపై హైకమాండ్ సైతం సీరియస్‌గా ఉంది.
షోకాజ్ నోటీసులు జారీ చేసి, 10 రోజుల్లోపు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది. ఉప ఎన్నికలు పూర్తయిన తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై స్పందిస్తారని చాలామంది భావించారు. ఐతే దీనిపై ఇప్పటివరకూ కోమటిరెడ్డి స్పందించలేదు. ఇప్పటుడు కోమటిరెడ్డి ఏం చేయబోతున్నారనేది పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కంటే ముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరిగి రావడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో ఆయన చక్రం తిప్పుతారని అంటున్నారు. ఇదిలావుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరిగి రావడంతో.. మునుగోడు ఉప ఎన్నికకు ముందే ఆయన ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తారు.. ? కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టేలా మళ్లీ ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా.. ? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.




మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సాగుతుండటంతో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొంటారని కొందరు అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వకుండానే పాదయాత్రలో పాల్గొనే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అనే అంశం కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి చూట్టూనే తిరుగుతున్నాయి. తమ్ముడి విజయం కోసం ఆయన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌పై ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
