Jana Reddy: కాంగ్రెస్ నేత జానారెడ్డికి అస్వస్థత.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న జానారెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా వైద్యులు పలు రకాల టెస్టులు చేశారు. ఈ క్రమంలోనే యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి.. గుండెలోని ఓ రక్తనాళం పూడ్చుకుపోయినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని వైద్యులు.. జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు. వారి అనుమతితో మంగళవారం రాత్రి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు, కుటుంబసభ్యులు వెల్లడించారు.
కాగా, జానారెడ్డి ఆరోగ్యంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరాతీస్తున్నారు. జానారెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో సౌమ్యుడిగా పేరుగడించిన జానా రెడ్డి.. ఇటీవల బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
