AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే.. భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ విజయమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించామని.. దీన్ని దృష్టిలో ఉంచుకోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చారని అన్నారు.

TSRTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే.. భట్టి కీలక వ్యాఖ్యలు
Batti Vikramarka
Aravind B
|

Updated on: Aug 01, 2023 | 3:43 PM

Share

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ విజయమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించామని.. దీన్ని దృష్టిలో ఉంచుకోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చారని అన్నారు. గతంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేయాలని తాము డిమాండ్ చేయగా.. అప్పట్లో సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఏం మాట్లాడారో అందిరికీ గుర్తుందని అన్నారు. పనికిమాలిన మాలిన పార్టీలు, పని లేని మాటలు మాట్లాడుతున్నాయని అన్నారని.. ఆర్టీసీ విలీనం చేయడం అసంభవమని సీఎం గతంలో అన్నారని భట్టి గుర్తుచేశారు. ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తులని.. వీటన్నంటిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 43,373 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇప్పటినుంచి వాళ్లకు జీతాలు ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం విధివిధానాల రూపకల్పనకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని మంత్రివర్గం పేర్కొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం రోజున ఆరుగంటల పాటు మంత్రిమండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. అనంతంరం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తమ నిర్ణయాన్ని మీడియాకు వివరించారు. అలాగే రాష్ట్రంలో వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతల ప్రజలకు కూడా 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మంత్రమండలి తీర్మానం చేసింది. వరదల్లో మృతిచెందిన 40 మంది కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాసలని నిర్ణయించింది. పంట నష్టాలను అంచనా వేసి నివేదికలు అందించాలని.. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్టును పౌరవిమానయాన సేవలకు కూడా వినియోగించేటట్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..