AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ కాంగ్రెస్..!

కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో సరికొత్త ప్రయోగం చేయబోతుందా..? ఆ మాజీ మావోయిస్టును బరిలోకి దింపి బీసీ ఓట్లకు ఎర వేయబోతుందా..? స్కెచ్ ఎంటి..? ఇంతకీ ఏ నియోజకవర్గం నుండి మాజీ మావోయిస్టును బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు..?

సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ కాంగ్రెస్..!
Gajarla Ashok
Srilakshmi C
| Edited By: |

Updated on: Oct 13, 2023 | 10:02 PM

Share

కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో సరికొత్త ప్రయోగం చేయబోతుందా..? ఆ మాజీ మావోయిస్టును బరిలోకి దింపి బీసీ ఓట్లకు ఎర వేయబోతుందా..? స్కెచ్ ఎంటి..? ఇంతకీ ఏ నియోజకవర్గం నుండి మాజీ మావోయిస్టును బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు..? ఎవరా కీలక నేత..? వాచ్ థిస్ స్టోరీ…

వనం నుండి జనంలోకి అడుగు పెట్టిన ఆ మాజీ మావోయిస్ట్ ఇప్పుడు బుల్లెట్‌ టూ బ్యాలెట్‌ వైపు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ గూటికి చేరిన గాజర్ల అశోక్‌ అలియాస్ ఐతు పరకాల టిక్కెట్ రేసులో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క తరహాలోనే ఈ మాజీ మావోయిస్టు, బీసీ నేతను బరిలోకి దింపి కాంగ్రెస్ పార్టీ మరో ప్రయోగానికి వ్యూహరచన చేస్తోందని ప్రచారం జరుగుతుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్ట్ నేత గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. తాడిత పీడిత ప్రజల కోసం 25 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన ఆయన ఇప్పుడు బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదనే సిద్దాంతంతో పరకాల నుండి పోటీకి తహతహలాడుతున్నాడు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఉధ్యమ నేపథ్య బలాన్ని బలగంగా మార్చుకుంటూ నేను సైతం అంటూ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు.. గాజర్ల అశోక్ ఎంట్రీతో తెలంగాణ విమోచనకు, సాయుధ రైతాంగ పోరాటానికి ఆయువుగా నిలిచిన పరకాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారనున్నాయి.

వెలిశాల గ్రామం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది గాజర్ల కుంటుంబం.. అప్పటి పీపుల్స్‌వార్‌ ఇప్పటి మావోయిస్టు పార్టీకి అంకితమైన కుటుంబం ఇది. వారంతా ప్రజా హక్కుల కోసం పోరాడిన యోధులే. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ–మల్లయ్య దంపతులకు ఐదుగురు కొడుకులు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌ లు… పెద్ద కొడుకు రాజయ్య అనారోగ్యంతో మరణించగా రెండవ కొడుకు సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు.. అప్పటికే వారి తల్లిదండ్రులు కనకమ్మ–మల్లయ్యలు కన్నుమూయడంతో మిగతావారు సారయ్య, రవి, అశోక్‌లు విప్లవ పంథాను ఎంచుకుని అడవిబాట పట్టారు…

1987లో గాజర్ల సారయ్య అలియాస్ భాస్కరన్న అలియాస్ ఆజాద్‌ అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. 1992లో గాజర్ల రవి అలియాస్‌ గణేష్ అదే పీపుల్స్ వార్ లో చేరారు. 1994లో గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు తన ఇద్దరు సోదరులు బాటలోనే తనూ కూడా అడవిబాట పట్టారు. పీపుల్స్‌వార్‌లో చేరిన గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్ అలియాస్ భాస్కర్ 2008 ఏప్రిల్‌ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తన సహచరి రమతో సహా ప్రాణాలు కోల్పోయారు …

మరో సోదరుడు గాజర్ల సమ్మయ్య అలియాస్ గణేష్… ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అనారోగ్య కారణాలతో 2016లో లొంగిపోయాడు. రెండున్నర దశాబ్ధాల పాటు మవోయిస్ట్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన గాజర్ల అశోక్ అలియాస్ ఐతు దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ మెంబర్‌గా పనిచేశాడు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కి రెడీ అవుతున్నాడు..

తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న గాజర్ల అశోక్ పరకాల నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు.. ఇప్పటికే మాజీ ఎంఎల్‌సి కొండా మురళీధర్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇనగాల వెంకట్రామిరెడ్డిలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్న్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతుందన్న ప్రచారం జరుగుతుంది. గాజర్ల అశోక్‌ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రజా పోరాటాలకు నిలయంగా నిలిచే పరకాల స్థానం నుంచి అశోక్‌‌ను బరిలోకి దింపడం వల్ల భూపాలపల్లి, ములుగు, మంథని నియోజకవర్గాలలో కూడా పార్టీకి ప్రచార అస్త్రం లభించే అవకాశమున్నట్లు పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..