AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో పచ్చి చికెన్ ముక్క తినాలనుకున్నాడు.. కట్ చేస్తే…

భీమ్లా గురువారం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న భీమ్లా నాయక్ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తన ఇంట్లోనే పచ్చి చికెన్ తిన్నాడు. చికెన్ గొంతులో ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన భార్య తీవ్ర ఆందోళన చెందింది. భర్తను బతికించుకునే ప్రయత్నం చేసింది.

మద్యం మత్తులో పచ్చి చికెన్ ముక్క తినాలనుకున్నాడు.. కట్ చేస్తే...
Chicken
P Shivteja
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 13, 2023 | 4:22 PM

Share

తాగిన మైకంలో పచ్చి చికెన్ ముక్కను తినడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం నవపేట్ రాములు తండాకు చెందిన లకావత్ భీమ్లా నాయక్ అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, నలుగురు పిల్లులు ఉన్నారు. హత్నూర మండలం కొత్తగూడ తండా భీమ్లా స్వగ్రామం కాగా.. తన భార్యా పిల్లలతో కలిసి నవపేట్ గ్రామ శివారులో నివాసం ఉంటున్నాడు.

రాములు భార్య రాణి సమీపంలో గల పరిశ్రమలో పనిచేస్తుంది. భీమ్లా గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తాడు. పనుల దొరకని క్రమంలో గుమ్మడిదల అడ్డపైన పనికి వెళుతుంటాడు. భీమ్లా గురువారం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న భీమ్లా నాయక్ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తన ఇంట్లోనే పచ్చి చికెన్ తిన్నాడు. చికెన్ గొంతులో ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన భార్య తీవ్ర ఆందోళన చెందింది. గొంతులో చేయి పెట్టి చికెన్‌ ముక్కను బయటకు తీసే ప్రయత్నం చేసింది. కొంచెం బయటికి తీయగా.. మిగిలిన చికెన్ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే భీమ్లా మృతి చెందాడు. నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నేడు అంత్యక్రియలు నిర్వహించారు.

అసలు పచ్చి చికెన్ తినడం ఏంటి..? తాగిన మైకం ఏమైనా చేస్తుంది. మత్తులో చేసిన పని ప్రాణాలకే ఎసరు పెట్టింది. ఉడికి ఉడకని చికెన్ తింటేనే.. ఎన్నో అనర్థాలు ఉన్నారు. రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఉడికిన మాంసం తినే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆదరా బాదరాగా తింటే ముక్క గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. బీ కేర్‌ఫుల్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..