AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ నయా కొత్వాల్ సందీప్ శాండిల్య.. కీలక పదవుల్లో కొత్త ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను తప్పించడంతో ఖాళీ అయిన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను అప్పగించారు. 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు.సీఎస్ ఆదేశాల మేరకు కొత్తగా నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం సాయంత్రంకల్లా తమ బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైదరాబాద్ నయా కొత్వాల్ సందీప్ శాండిల్య.. కీలక పదవుల్లో కొత్త ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
Sandeep Shandilya IPS (File Photo)
Vijay Saatha
| Edited By: |

Updated on: Oct 13, 2023 | 7:34 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కీలక విధుల నుంచి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్త వారికి పోస్టింగ్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను తప్పించడంతో ఖాళీ అయిన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను అప్పగించారు. 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. సీఎస్ ఆదేశాల మేరకు కొత్తగా నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం సాయంత్రంకల్లా తమ బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పదవి నుంచి సీవీ ఆనంద్‌ను తప్పిస్తూ ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో.. ఆయన స్థానంలో ముగ్గురు పేర్లతో కూడిన అధికారుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ఈసీకి పంపించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు సందీప్ శాండిల్యా, కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, శివ ధర్ రెడ్డి పేర్లను తెలంగాణ ప్రభుత్వం ఈసీకి పంపింది. వీరిలో 1993 మ్యాచ్ కి చెందిన సందీప్ శాండిల్యను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఈసీ సూచన మేరకు సందీప్ శాండిల్యను హైదరాబాద్ సీపీని నియమిస్తూ సీఎస్ శాంతి కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

సందీప్ శాండిల్యకి ముక్కుసూటితనం కలిగిన అధికారిగా పేరు ఉంది. గతంలో ఆయన అనేక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటుగా,, సైబరాబాద్ సిపిగా రెండున్నర ఏళ్ళ పాటు పనిచేశారు. అలాగే గుంటూరు ఏఎస్పీ, గోదావరిఖ ఏఎస్పీగా, నల్గొండగా ఓఎస్డీగా పనిచేశారు. ఆదిలాబాద్ ఎస్పీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన మావోయిస్ట్ ఉద్యమాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.. కృష్ణా జిల్లా ఎస్పీగా సైతం సేవలు అందించారు.

కొత్తగా నియమితులైన ఐపీఎస్ అధికారులు..

అటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా కల్మేశ్వర్, వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా అంబర్‌ కిశోర్‌ ఝా నియమితులయ్యారు. అలాగే సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరు రూపేష్, జగిత్యాల ఎస్పీగా సంప్రీత్ సింగ్, జగిత్యాల ఎస్పీగా సంప్రీత్ సింగ్, కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, నాగర్‌కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీగా రితిరాజ్, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ పంగ్రామ్ సింగ్ గణపతిరావ్, నారాయణపేట్ ఎస్పీగా యోగేష్ గౌతమ్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ప్రభాకర్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే నియమితులయ్యారు.

కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారులు..

కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా గౌతం, యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్ నియమించాలని ఈసీ ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్, వాణిజ్య శాఖ కమిషనర్‌గా క్రిస్టినా, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ నియమితులయ్యారు.